ETV Bharat / state

తల్లిదండ్రుల చెంతకు ఛత్తీస్‌గఢ్‌ బాలుడు

author img

By

Published : Mar 15, 2021, 4:53 AM IST

తల్లిదండ్రుల చెంతకు ఛత్తీస్‌గఢ్‌ బాలుడు
తల్లిదండ్రుల చెంతకు ఛత్తీస్‌గఢ్‌ బాలుడు

కన్నబిడ్డ కనరాక తల్లడిల్లిన తల్లి వేదనకు తెరపడిన క్షణమది..! ముద్దులకొడుకు ఆచూకీకోసం నిలువెల్లా కనులై నిరీక్షించిన నాన్నకు సాంత్వన దొరికిన సమయమది...! పక్షం రోజుల తర్వాత పిల్లాడిని చూసుకున్న తల్లిదండ్రులు ముద్దులవర్షంలో.. ముంచెత్తారు. కన్నబిడ్డను ఒడికి చేర్చిన తిరుపతి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు...

తల్లిదండ్రుల చెంతకు ఛత్తీస్‌గఢ్‌ బాలుడు

‍ ఫిబ్రవరి 27న తిరుమల శ్రీవారి దర్శనానికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన 50 మంది బృందం నుంచి అపహరణకు గురైన ఆరేళ్ల బాలుడు శివమ్ కుమార్ సాహూ... ఎట్టకేలకు అమ్మానాన్నల చెంతకు చేరాడు. అలిపిరి లింక్ బస్టాండ్ నుంచి............ 15 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి అపహరించగా.... తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర సాంకేతికత ఆధారంగా ఎస్పీ వెంకట అప్పలనాయుడి ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలు ఏపీ సహా కర్ణాటక, తమిళనాడు సరిహద్దు గ్రామాలను జల్లెడ పట్టాయి.

కిడ్నాపర్‌ కర్ణాటకలోని కోలార్ జిల్లా పుట్టణ్ణహళ్లికి చెందిన శివప్పగా గుర్తించారు. గతేడాది రెండో కుమారుడి మరణంతో మానసిక వ్యథకు గురైన శివప్ప.... మద్యానికి బానిసై స్థిరనివాసం లేకుండా తిరుగుతున్నాడని పోలీసుల దర్యాప్తులో... వెల్లడైంది. శనివారం విజయవాడ బస్టాండ్ సమీపంలో బాలుడిని గుర్తించిన అక్కడి పోలీసులు.. తిరుపతి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. చైల్డ్ లైన్ అధికారుల సమక్షంలో బాలుడిని అప్పగించగా.. ఆదివారం సాయంత్రం తిరుపతిలో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. 15రోజుల తర్వాత పిల్లాడిని చూసిన తల్లిదండ్రులు ఆనందబాష్పాలతో తనయుడిని తనివితీరా ముద్దాడారు.

మా అబ్బాయి కనిపిస్తాడేమోననే ఆశతో.......... బస్టాండ్, రైల్వేస్టేషన్‌ ఇలా నాలుగు దిశలా వెతకని చోటంటూ లేదు. 15 రోజులుగా పగలూ రాత్రీ అబ్బాయి గురించి బెంగ మమ్మల్ని వేధించేది. పోలీసులు ఎప్పటికప్పుడు నాకు సమాచారమందిస్తూనే ఉన్నారు. అబ్బాయికేం కాదు, వెంకన్న ఆశీస్సులు ఉన్నాయంటూ వారు నాకు ధైర్యాన్నిచ్చారు.

- ఉత్తమ్ కుమార్ సాహూ, బాలుడి తండ్రి,

ఇన్ని రోజులుగా పిల్లాడు కనపడట్లేదు... ఏం తిన్నాడో, ఎలా ఉన్నాడో అన్న ఆలోచనలతో చాలా బాధపడ్డాం. ప్రజల ఆశీస్సులు, భగవంతుని కృపతో.................. ఎట్టకేలకు దొరికాడు. నా బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని మథనపడ్డా. పిల్లాడు బాగానే ఉన్నాడు కానీ కాస్త బెదిరినట్టు అనిపిస్తోంది. మొదట తన పేరు కూడా చెప్పలేకపోయాడు. కిడ్నాపర్‌ భయపెట్టి ఉండటం వల్ల ఇలా అయి ఉండొచ్చు.

-తులేష్ కుమార్ సాహూ, బాలుడి తల్లి

కిడ్నాపర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామన్న ఎస్పీ.... అపహరణ ముఠాలతో నిందితుడికి సంబంధం ఉన్నట్టు తాము భావించట్లేదన్నారు. వెంకట అప్పలనాయుడు తిరుపతి అర్బన్ ఎస్పీ

తల్లిదండ్రులతో కలిపి బాలుడిని శ్రీవారి దర్శనానికి పంపిన తర్వాత..... న్యాయపరమైన అంశాలను పూర్తి చేసి వారిని సొంతరాష్ట్రానికి పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

తిరుపతిలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్‌ బాలుడు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.