ETV Bharat / state

Theft: జల్సాలకు అలవాటు పడి... ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తూ..

author img

By

Published : Sep 12, 2021, 4:46 PM IST

bike thieves were arrested at chittor
పోలీసులకు చిక్కిన ద్విచక్ర వాహనాల దొంగలు

వారి విలాసాలకు ద్విచక్ర వాహనాల దొంగతనాలనే ఆసరాగా చేసుకున్నారు. లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలను దొంగిలించి.. వాటిని విక్రయించే దుండగులను చిత్తూరు జిల్లా క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.40లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ వాటిని విక్రయించి జల్సాలకు పాల్పడుతున్న పలువురు దొంగలను.. చిత్తూరు క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.40లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులకు చిక్కిన ద్విచక్ర వాహనాల దొంగలు

‘శుక్రవారం నగరంలోని మురకంబట్టు వద్ద ద్విచక్ర వాహనాల్లో వస్తున్న ఇద్దరు యువకులను తనిఖీ చేశాం. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం.. వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో రెండు వాహనాలు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించాం. వారిని బంగారుపాళ్యంకు చెందిన రాజేష్‌, యాదమరికి చెందిన ఈశ్వర్‌గా గుర్తించాం.

రాజేష్‌ తిరుపతిలో నివసిస్తూ జులాయిగా తిరుగుతూ యూట్యూబ్‌ ద్వారా ద్విచక్ర వాహనాలు చోరీ చేసే విధానాన్ని తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడని తేలింది. ఇలా తిరుపతి, రేణిగుంట, ఎం.ఆర్‌.పల్లి, అలిపిరి, చంద్రగిరి, ఐరాల, పలమనేరు, చిత్తూరు, కడపలోనూ ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు అంగీకరించారు. రాజేష్‌, ఈశ్వర్‌ కలిసి ఈ దొంగతనాలు చేశారు. రూ.3.90 లక్షల విలువైన కేటీఎం వాహనాన్ని రూ.40 వేలు, రూ.1.90 లక్షల విలువైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని రూ.35 వేలకు విక్రయించినట్లు గుర్తించాం. ఆయా వాహనాలను కొన్నింటిని విక్రయించగా మరికొన్నింటిని ఈశ్వర్‌కు చెందిన తోటలో దాచారు. వాటినీ స్వాధీనం చేసుకున్నాం. నిందితులను రిమాండ్‌కు తరలించాం’ - రమేష్‌, క్రైం సీఐ చిత్తూరు.

ఇదీ చదవండి:

TWO DIED: గ్రానైట్ క్వారీలో ప్రమాదం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.