ETV Bharat / state

DEPUTY CM NARAYANA SWAMY: 'మహిళలు అంటే పవన్‌కల్యాణ్‌కు గౌరవం లేదు'

author img

By

Published : Sep 29, 2021, 9:32 AM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు మహిళలంటే గౌరవం లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదని విమర్శించారు.

ap-deputy-cm-narayana-swamy-visiteds-tirumala
మహిళలు అంటే పవన్‌కల్యాణ్‌కు గౌరవం లేదు

మహిళలు అంటే పవన్‌కల్యాణ్‌కు గౌరవం లేదు

తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. తన నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వంద శాతం సీట్లు మహిళలకే కేటాయించినట్లు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్​పై ధ్వజమెత్తారు. మహిళలంటే పవన్ కల్యాణ్​కు గౌరవం లేదని వెల్లడించారు. పవన్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు.

ఇదీ చూడండి: Janasena VS YCP: తీవ్ర స్థాయికి మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.