ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో రెండు నెలల ముందే పశువుల పండగ...ఎందుకంటే?

author img

By

Published : Nov 23, 2020, 6:09 PM IST

A cattle festival is being organized in Chittoor district two months before this year.
చిత్తూరు జిల్లాలో రెండు నెలలకు ముందే పశువుల పండగ

సంక్రాంతి నాడు జరగాల్సిన పశువుల పండగ ముందే నిర్వహించడానికి గల కారణం ఏమిటి...? చిత్తూరు జిల్లా పశువుల పండగకు కాకుండా..... జల్లికట్టుకు సిద్ధం అవుతుందా....? ఎద్దులను బరిలోకి దింపేందుకు నిర్వాహకులు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు....? జిల్లాలో ముందస్తుగా పశువుల పండగ నిర్వహించడంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.


సంక్రాంతి అనగానే కోస్తా ఆంధ్రాలో కోడి పందాలు ఎలా గుర్తుకొస్తాయో..... అలాగే రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండగ కూడా గుర్తొస్తుంది. కోస్తా ఆంధ్రాలో కోళ్ళపందేలకు కోళ్ళను ఎలా సిద్ధం చేస్తారో.... చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ కోసం ఎద్దులను కూడా అలాగే సిద్ధం చేస్తున్నారనే చెప్పాలి. అయితే తమిళనాడు రాష్ట్రంలో జరిగే జల్లికట్టుకు ఎద్దుల్ని ముందు నుంచే సిద్ధం చేస్తారు. బలంగా, ఆరోగ్యంగా, దూకుడుగా ఉండేలా దాణా తినిపిస్తారు. అలాంటి ఎద్దుల కోసం ఇప్పుడు చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలపై తమిళుల కన్ను పడిందని చెప్పాలి.

పశువుల పండగ ఎలా నిర్వహిస్తారంటే..

ప్రతి ఏటా జనవరి 15 నుంచి నెల చివరి వరకూ పశువుల పండుగ నిర్వహించడం చిత్తూరు జిల్లాలో తరతరాలుగా వస్తున్న ఆచారం. సంక్రాంతి పండగలో చివరి రోజు కనుమ పండగ. సంవత్సరం అంతా రైతులకు సహాయంగా ఉండే మూగజీవాలను ఆ కనుమ రోజున ఆరాధించడం ఇక్కడి ప్రజల సాంప్రదాయం. పండుగ ముందు రోజు నుంచే పశువులను సిద్ధం చేస్తారు. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను ఒక్కొక్కటిగా ఊరు మధ్యలో జనాలపైకి వదులుతారు. ఆవులను, దూడలను గుంపులు గుంపులుగా తరుముతారు. వాటిని నిలువరించి కొమ్ములకు కట్టిన చెక్క పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఇది చిత్తూరు జిల్లాలోని పశువుల పండగ తీరు.

ఈ పండగపై తమిళుల ఆసక్తి...

అయితే చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం రెండు నెలల ముందే పశువుల పండగ నిర్వహిస్తున్నారు. ఈ పండగలో తమిళులు పాల్గొని ప్రతిభ కనబరిచిన ఎద్దులను కొని తీసుకెళ్తున్నారు. తమిళనాడులో పశువుల పండుగను జల్లికట్టుగా పిలుస్తారు. అక్కడ జల్లికట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. అందుకే జల్లికట్టు కోసం చిత్తూరు జిల్లాలోని ఎద్దులను ఎంపిక చేసుకుని వాటిని లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కుంటారు. ఇలా అధిక ధరలకు తమిళులు కొనుగోలు చేయడంతో జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పశువుల పండుగను సంక్రాంతికి రెండు నెలల ముందే జరుపుకుంటున్నారు. ఈ పశువుల పండుగ పేరుతో జోరుగా వ్యాపారం సాగుతోంది. ఒక పక్క ఇది చట్ట విరుద్ధమని పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా..... నిర్వాహకుల చెవికి ఎక్కడం లేదు. సంక్రాంతి ముందే పశువుల పండుగను నిర్వహించడంపై సాంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇదీ చదవండి:

ముందే వచ్చిన సంక్రాంతి.. వెనుకే వచ్చిన పోలీసులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.