ETV Bharat / state

బాపట్లలో మద్యం తాగి ఇద్దరి మృతి.. విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారని లోకేశ్ ఫైర్

author img

By

Published : Jul 16, 2022, 10:19 AM IST

nara lokesh fires on ysrcp over people expiring of drinking adulterous liquor
విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారని లోకేశ్ ఫైర్

Lokesh fires on YSRCP: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో విషాదం నెలకొంది. గంట వ్యవధిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రేపల్లె శివారు ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సరకు తెచ్చుకొని తాగిన తర్వాతే వృద్ధులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జే బ్రాండ్ విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారని ప్రశ్నించారు. మ‌ద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

  • ర‌క్త పిశాచుల గురించి విన్నాం. తొలిసారిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రూపంలో ధ‌న‌పిశాచిని చూస్తున్నాం. నిరుపేద‌లు, కూలీలు రోజంతా రెక్క‌లు ముక్క‌లు చేసుకుని సంపాదించిన డ‌బ్బునీ మ‌ద్యం పేరుతో లాగేస్తున్నారు. బాప‌ట్ల‌ జిల్లా రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో..(1/4) pic.twitter.com/rR4S2HYnxH

    — Lokesh Nara (@naralokesh) July 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • జే బ్రాండ్స్ తాగి చ‌నిపోయిన ఒక్కొక్క‌రి కుటుంబానికి 50 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలి. ప్ర‌జారోగ్యాన్ని హ‌రిస్తూ, ప్ర‌మాద‌క‌ర మ‌ద్యంతో ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తూ వేల‌కోట్లు వెనకేసుకుంటున్న మ‌ద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాలి.(4/4)#KillerJBrands #JaganPaniAyipoyindhi

    — Lokesh Nara (@naralokesh) July 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Lokesh fires on YSRCP: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో విషాదం నెలకొంది. గంట వ్యవధిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రేపల్లె శివారు ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సరకు తెచ్చుకొని తాగిన తర్వాతే వృద్ధులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని ఒకరి పెద్దఖర్మకు హాజరైన 8మంది మద్యం తాగారు. భోజనం చేసి ఇంటికెళ్లిన కొద్దిసేపటికి వారిలో ఐదుగురికి వాంతులై అస్వస్థతకు గురయ్యారు. గరికపాటి నాంచారయ్య, రేపల్లె రత్తయ్య అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. గుంటూరు ఆసుపత్రిలో చేర్చారు.

ఈ ఘటనపై స్పందించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. ప్రభుత్వం అమ్ముతోన్న విష‌మ‌ద్యం తాగి ఇద్దరు బ‌ల‌య్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నిరుపేద‌లు, కూలీలు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డ‌బ్బునీ మ‌ద్యం పేరుతో లాగేస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. జే బ్రాండ్ విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారని ప్రశ్నించారు. మ‌ద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

జ‌గ‌న్‌రెడ్డి బినామీలు త‌యారు చేసి అమ్ముతోన్న మ‌ద్యంలో.. విష‌ర‌సాయ‌నాలున్నాయ‌ని తెదేపా ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడితే, మ‌ద్యంపై ఆదాయం రావ‌డం తెదేపకి ఇష్టంలేదంటూ కొత్త ఏడుపు మొద‌లుపెట్టారని లోకేశ్ దుయ్యబట్టారు.

జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి ప‌దులసంఖ్య‌లో మృత్యువాత‌ప‌డితే స‌హ‌జ‌మ‌ర‌ణాలంటూ తప్పించుకున్నారని ఆక్షేపించారు. చిల‌క‌లూరిపేటలో జే బ్రాండ్ మ‌ద్యం తాగి ఇద్ద‌రు చ‌నిపోతే, కేసుని నీరుగార్చేశారని ఆరోపించారు. మ‌ద్యంషాపులో వైకాపా కార్య‌క‌ర్త‌ల‌కు ఉద్యోగాలిచ్చి.. జగన్​రెడ్డి ఇన్ని లాభాలు పొందుతున్నారని మండిపడ్డారు.

విష‌మ‌ద్యంతో ప్రజ‌ల ప్రాణాలు తీస్తూ కోట్లు లెక్క పెట్టుకుంటున్న ముఖ్యమంత్రి జే బ్రాండ్ విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ మ‌ద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు అమ్మకం నిలిపేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్‌షాపుల నుంచి శాంపిళ్లని సేక‌రించి ల్యాబుల్లో ప‌రీక్షించడంతో పాటు జే బ్రాండ్స్ తాగి చ‌నిపోయిన ఒక్కొక్క‌రి కుటుంబానికి 50 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలన్నారు. ప్రజారోగ్యాన్ని హ‌రిస్తూ, ప్రమాద‌క‌ర మ‌ద్యంతో ప్రజ‌ల ప్రాణాలు తీస్తూ వేల‌కోట్లు వెనకేసుకుంటున్న మ‌ద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.