ETV Bharat / state

SUICIDE: మహిళా వాలంటీర్ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య..!

author img

By

Published : May 19, 2022, 9:49 AM IST

Updated : May 19, 2022, 11:46 AM IST

SUICIDE: వివాహేతర సంబంధం నేపథ్యంలో.. ఈ నెల 15న బాపట్ల జిల్లాలో వాలంటీర్​ హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్​లో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు.

suicide
suicide

SUICIDE: బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన మహిళా వాలంటీర్ శారద హత్యకేసు నిందితుడు పద్మారావు(35) ఆత్మహత్య చేసుకున్నాడు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. తిరుపతి నుంచి విశాఖ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కిందపడి పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

గతంలో ఏం జరిగిందంటే? : చావలి గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద(27)కు, అదే గ్రామంలోని మేనమామ ధర్మారావుతో 2008లో వివాహం జరిగింది. శారద స్థానికంగా వాలంటీర్‌గా పనిచేస్తోంది. అయితే.. చావలి గ్రామానికే చెందిన పద్మారావుతో శారదకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శారదపై అనుమానంతో పద్మారావు ఆరు నెలల క్రితం గ్రామ సచివాలయం వద్ద ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ విషయమై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది శారద. దీంతో.. పోలీసులు పద్మారావును మందలించారు. ఈ ఘటనతో శారదపై కక్ష పెంచుకున్న పద్మారావు.. ఈ నెల 15న ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు పనిచేస్తున్న సమయంలో వెళ్లి కత్తితో దాడిచేశాడు. తప్పించుకొని పారిపోతున్నా.. వెంబడించి మెడపై దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కల్యాణ్‌రాజ్‌ తెలిపారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. పద్మారావు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : May 19, 2022, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.