ETV Bharat / state

Complaint: పోలీస్​ స్టేషన్​కు 9 ఏళ్ల బాలుడు.. ఎందుకంటే..!

author img

By

Published : May 4, 2023, 10:57 PM IST

Updated : May 5, 2023, 6:25 AM IST

Etv Bharat
Etv Bharat

9Years Boy Complaint to Police: బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్​కు వచ్చిన 9 ఏళ్ల బాలుడు కన్నతండ్రిపై ఎస్​ఐకి ఫిర్యాదు చేశాడు. తన తండ్రి తాగొచ్చి రోజు తన తల్లిని, తనను కొడుతున్నాడని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అలాగే చిన్నవాడైనా.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు భయపడకుండా సమాధానాలు ఇచ్చాడు. ఇక పూర్తి వినరాల్లోకి వెళ్తే...

9Years Boy Complaint On His Father: ఈ మధ్య కాలంలో పిల్లలు ఎంతలా తెలివి మీరిపోయారో చెప్పనక్కర్లేదు. సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల ఎంతలా అవగాహన కలిగి ఉన్నారో ఈ దృశ్యం చూస్తే అర్థం అవుతోంది. తన తండ్రి రోజు తాగొచ్చి తన తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడని ఓ తొమ్మిదేళ్ల బాలుడు పోలీస్​ స్టేషన్ తలుపు తట్టాడు. అంతేకాదు, తన తండ్రి చేతిలో తన మాతృమూర్తి ఏవిధంగా చిత్రహిసలకు గురవుతుందో కళ్లకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ పిల్లవాడు చెప్పిన మాటలు విన్న ఎస్​ఐ చలించి పోయాడు. పిల్లవాడిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తన తండ్రి రోజు తాగి వచ్చి ఇంట్లో అల్లరి చేస్తాడని ఎస్​ఐకి తెలిపాడు. అలాగే తాగిన తరువాత తన తల్లిపై చేయి చేసుకుంటాడని వెల్లడించాడు. తన తల్లి పడే బాధలు చూడలేకే పోలీసు స్టేషన్ తలుపు తట్టినట్లు ఆ పిల్లాడు తెలిపాడు.

తండ్రిపై ఫిర్యాదు చేస్తున్న బాలుడు

బాపట్ల జిల్లాలోని కర్లపాలెం పోలీస్ స్టేషన్​కు వచ్చిన 9 ఏళ్ల బాలుడు కన్నతండ్రిపై ఎస్​ఐకి ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. ఆ బాలుడిని చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం బాలుడు వద్ద నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కర్లపాలెం ఎస్సై శివయ్యకు కొంతసేపు సంభాషణ జరిగింది.

ఎస్​ఐ శివయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలుడు పేరు రహీం, తల్లిదండ్రులు సుభాని, శుభాభినిలు. కాగా పాత ఇస్లాంపేటకు చెందిన సుభానికి శుభాభితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహ అనంతరం రహీం తండ్రి సుభాని వడ్ల మిల్లుతో పాటు టైలరింగ్ పని చేస్తున్నాడని.. తల్లి గృహిణిగా ఉంటోందని ఎస్సై పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సుభాని రోజు రాత్రిపూట మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లి అయిన శుభాభిని కొడతాడని పోలీసులు తెలిపారు. ఇలా రోజు తాగొచ్చి తన తల్లిని కొట్టడం చూసిన రహీం, అది తట్టుకోలేక 9 ఏళ్ల కుమారుడు రహీంకి పోలీస్ స్టేషన్ వెళ్లమని ఎవరు చెప్పారో ఏమో తెలియదు కానీ, స్టేషన్​కు వెళ్లి తన తండ్రిని పిలిపించి మందలించాలని.. తనకు ఫిర్యాదు చేశాడని ఎస్ఐ తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన ఎస్ఐ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపారు. దీంతో కన్న తండ్రిపై 9 ఏళ్ల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

Last Updated :May 5, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.