ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు @7am

author img

By

Published : Dec 19, 2022, 6:59 AM IST

..

7am topnews
ప్రధానవార్తలు7am

  • హోరాహోరీగా ప్రపంచకప్ ఫైనల్.. విశ్వవిజేతగా అర్జెంటీనా
    ప్రపంచకప్​కు సిసలైన ముగింపు. సమ ఉజ్జీవుల పోరులో మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠ.. ఫైనల్​లో తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిపోయాయి అర్జెంటీనా, ఫ్రాన్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భాజపా, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు : పవన్‌ కల్యాణ్‌
    వైకాపా సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ ఏకం చేసి కొత్త ప్రభుత్వం స్థాపించడమే తన లక్ష్యమని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తేల్చిచెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాదని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో వైకాపా మరింతగా విధ్వంసం సృష్టించనుందన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాలని.. జనసైనికులకు పవన్‌ పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒకటో తారీఖు తరువాత.. ఎన్ని రోజులు కావాలి సీఎం గారు..!
    ఉద్దేశపూర్వకంగానే ఒకటో తేదీన వేతనాలు ఇవ్వటం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గౌరవం దక్కటం లేదంటూ.. విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో గత సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాచర్లలో ఎవరెం చేశారో.. ఆధారాలున్నాయి : డీఐజీ త్రివిక్రమ్‌వర్మ
    DIG on Macherla incident: మాచర్ల ఘటనపై గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్‌వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఎవరెవరు ఏమేం చేశారో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పార్టీల నేతలు పరస్పరం రెచ్చగొట్టుకున్నారని ఆయన తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాచర్ల ఘటనపై డీఐజీతో టీడీపీ నేతలు.. మా పార్టీ నేతలపై ఆ సెక్షన్లు ఎలా పెడతారు
    పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మను కలిశారు. టీడీపీ నేతలపై నమోదు చసిన కేసులో హత్యాయత్నం సెక్షన్లు పెట్టడాన్ని వారు తప్పుపట్టారు. మాచర్ల ఘటనలో పోలీసుల వైఖరిపై డీఐజీ కి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రైలులో మొబైల్​ చోరీ చేసిన యువకుడిని బయటకు తోసేసి హత్య
    ఉత్తర్​ ప్రదేశ్ బరేలి​లో దారుణం జరిగింది. రైలులో మొబైల్​ చోరీ చేశాడని ఓ యువకుడిని తీవ్రంగా కొట్టారు ప్రయాణికులు. అతడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. అనంతరం ఎమర్జెన్సీ డోర్​ నుంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా తోటి ప్రయానికులు ఘటనను అడ్డుకోవడం మానేసి వారు సహకరిస్తున్నట్లు వీడియోలో అర్థమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనాతో సరిహద్దులో వివాదం.. వాణిజ్యంలో మాత్రం జోష్.. దిగుమతులు నిషేధించలేమా?
    గల్వాన్‌లో ఘర్షణలు, అరుణాచల్‌ ప్రదేశ్‌లో దుందుడుకు చర్యలతో చైనా మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. అయినా డ్రాగన్‌ నుంచి భారత్‌ దిగుమతులు తగ్గడం లేదు. గల్వాన్‌ ఘర్షణ అనంతరం కూడా చైనా దిగుమతులు పెరగడంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పదునైన విమర్శలు సంధిస్తున్నాయి. చైనా ఆర్మీ సరిహద్దుల్లో మన సైనికులపై దాడులకు దిగుతుంటే శిక్షించాల్సిన మోదీ ప్రభుతం దిగుమతుల రూపంలో బహుమతులు ఇస్తోందని ఎద్దేవా చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • త్వరలో మూడు కరోనా వేవ్​లు.. 10 లక్షల మరణాలు.. చైనాలో ఇక విధ్వంసమే!
    కొవిడ్ ఆంక్షల సడలింపుతో చైనాలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా.. తాజా నివేదిక మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ శీతాకాలంలో డ్రాగన్ 3 కరోనా వేవ్‌లను ఎదుర్కొవచ్చని.. నిపుణులు హెచ్చరించారు. ఇందులో ఒక వేవ్‌ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు.. 2023లో చైనావ్యాప్తంగా 10 లక్షలకు పైగా కొవిడ్ మరణాలు సంభవిస్తాయని అమెరికా పరిశోధన సంస్థ అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విమానంలో సచిన్‌.. నినాదాలతో హోరెత్తించిన అభిమానులు.. వీడియో వైరల్
    టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌.. తన ప్రయాణంలో భాగంగా విమానాన్ని ఎక్కారు. అభిమానులు కేకలు వేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఈ లెజెండ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'బిగ్‌బాస్‌ సీజన్‌ 6' విజేత సింగర్‌ రేవంత్‌.. చివర్లో ట్విస్ట్‌ సూపర్!
    'బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6' విజేతగా తెలుగు సినీ ప్లేబ్యాక్​ సింగర్​ రేవంత్‌ నిలిచారు. ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఫైనల్​లో విజయం రేవంత్​ని వరించింది. ఈ సీజన్​లో 21 మంది కంటెస్టెంట్​లు టైటిల్​ కోసం పోటీ పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.