ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Dec 18, 2022, 2:58 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

  • అరాచక శక్తులకు సహకరిస్తున్న పల్నాడు ఎస్పీని వెంటనే తొలగించాలి: చంద్రబాబు
    CBN : పల్నాడు ఎస్పీ తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఎస్పీ స్థానంలో హోంగార్డును పెట్టినా సమర్థంగా విధులు నిర్వహించేవారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీశైలంలో ‌దుకాణాలు తొలగింపు.. రోడ్డుపై వ్యాపారుల ఆందోళన
    Shopkeepers Protest on Road in Srisailam: శ్రీశైలం ఆలయానికి ఇరువైపులా ఉన్న పాత దుకాణాలను తొలగించవద్దంటూ దుకాణదారులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. దీంతో దుకాణాదారులు, ‌అధికారులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. కొత్తగా నిర్మించిన సముదాయాల్లో తమకు సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటన..గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం
    Roja Dimsa Dance: అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి వద్ద రూ.మూడు కోట్లతో నిర్మిస్తున్న హరిత రిసార్ట్స్​ను మంత్రి రోజా ప్రారంభించారు. జిల్లా ఏజెన్సీ ఏరియాలో పర్యటించిన ఆమె.. ఏజెన్సీ సంప్రదాయమైన ధింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ చూపరులను కనువిందు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వంతెన పూర్తి అయ్యేదెప్పుడు.. ప్రజల కష్టాలు తీరేదెప్పుడు
    Bridge Issue Over Chitravathi River: వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామం నుంచి ఏ విద్యార్థి బడికెళ్లలేని పరిస్థితి. నదిలో ప్రవాహంతో రైతులు పొలం పనులకూ పోలేని దుస్థితి. ధర్మవరం మండలం.. పోతులనాగేపల్లి-కనుంపల్లి గ్రామాల మధ్య చిత్రావతి నదిపై వంతెన లేక ప్రజల అవస్థలు.. వర్ణణాతీతంగా మారాయి. కష్టాల నుంచి గట్టెక్కేందుకు..ప్రజలే చందాలు వేసుకుని వంతెన నిర్మాణం చేపట్టారు. వరద ఉద్ధృతికి అది కూడా కొంతమేర కొట్టుకుపోవడంతో..కనుంపల్లి గ్రామస్థుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అరుదైన వ్యాధితో బంగ్లాదేశ్​ చిన్నారి.. పునర్జన్మనిచ్చిన భారత వైద్యులు
    ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న బంగ్లాదేశీ చిన్నారికి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. చిన్నారి మెదడులో ఉబ్బిన భాగాన్ని తొలగించి తలకు సరైన ఆకృతిని ఇచ్చారు వైద్యులు దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరో 'శ్రద్ధా వాకర్' తరహా దారుణం.. రెండో భార్యను చంపి ముక్కలుగా చేసి..
    యావత్​ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా వాకర్​ హత్య తరహా దారుణం ఝార్ఖండ్​లో జరిగింది. ఓ వ్యక్తి తన రెండో భార్యను పాశవికంగా హత్యచేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్నిఅనేక ముక్కలుగా నరికి బయటపడేశాడు. మరోవైపు, అమెరికా వెళ్లబోతున్నానన్న ఆనందంలో ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన పంజాబ్​లో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇరాన్​లో ప్రభుత్వ అణచివేతపై నిరసనగళం.. 'ఆస్కార్‌' సినిమా నటి అరెస్ట్
    ఇరాన్‌లో కొనసాగుతోన్న ఆందోళనలకు మద్దతు పలికిన ప్రముఖ ఇరానియన్‌ నటి తారానేహ్‌ అలీదూస్తిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. 2016లో ఆస్కార్ సాధించిన 'ది సేల్స్‌మన్‌' చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రెడిట్​ స్కోర్​ తగ్గిందా?.. అయితే ఇలా పెంచుకోండి!
    తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారు రుణాలు తీసుకోవడం, క్రెడిట్‌ కార్డులు తీసుకోవడంలాంటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఉద్యోగం ఇచ్చే సమయంలో సంస్థలూ ఈ స్కోరును గమనిస్తున్నాయి. మీ రుణ దరఖాస్తును పరిశీలించేటప్పుడు రుణదాత ప్రధానంగా పరిశీలించే అంశాల్లో క్రెడిట్‌ స్కోరే ముందుంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ స్కోరు అనుకున్నంత లేకపోతే దాన్ని మెరుగుపర్చుకునేందుకు ఏం చేయాలి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రిషభ్‌ పంత్‌ స్టంపింగ్‌ను చూసి ధోనీ గర్వంగా ఫీలై ఉంటాడు: డీకే
    బంగ్లాదేశ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో పంత్​ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కీపింగ్​లో చురుగ్గా వ్యవహరించాడు. ఈ క్రమంలో పంత్‌పై సీనియర్ వికెట్ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసలు కురిపించాడు. ఏమన్నాడంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మా జీవితంలో భయంకరమైన టైమ్​ అది.. గౌతమ్​ ఇప్పుడు ఇలా ఉన్నాడంటే వారే కారణం'
    టాలీవుడ్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు మహేశ్‌బాబు, నమ్రత. ఈ ఏడాదితో వీరిద్దరూ వివాహం చేసుకుని 17 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ వైవాహిక బంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.