ETV Bharat / state

'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు' ఆకట్టుకుంటున్న ఫ్లెక్సి..! టీచర్లు ఆలోచించి ఓటు వేయండి!

author img

By

Published : Mar 12, 2023, 7:11 PM IST

మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు" అంటూ... అనంతపురంలో ఓ ఇంటి ముందు ఫ్లెక్సీ వెలిసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటును అమ్ముకుని... ఆత్మగౌరవాన్ని, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టలేమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ సరైన అభ్యర్థికి ఓటు వేయాలని, డబ్బులకు ఓటు అమ్ముకోవద్దని విజయభాస్కర్‌ సూచిస్తున్నారు

Etv Bharat
Etv Bharat

graduates and teachers MLC elections: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే రూ.3 నుంచి రూ.5 వేల రూపాయలు వస్తాయని.. దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు. నేపథ్యంలో.. ఓటు విలువను తెలియజేస్తూ.. ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ వినుత్న ప్రయత్నం చేశారు. ఓట్లను అమ్ముకోనని వెల్లడిస్తూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ పెట్టారు. తాను, తన కుటుంబం తమ ఓట్లను అమ్ముకోమని చెబుతూ.. ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తాము చదువుకున్నామని, తమకు వచ్చే జీతం సరిపోతుందని తెలియజేస్తూ.. ఆ బ్యానర్ ద్వారా తమ ఇంటికి ఓట్ల కోసం వచ్చే వారికి పరోక్షంగా తాను అమ్ముడు పోయే వాడిని కాదంటూ తెలియజేస్తున్నారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఫ్లెక్సీ ఏర్పాటైంది. ఈ ఫ్లెక్సీ స్థానికంగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీసస్ నగర్ లోని డోర్ నెంబర్ 12-3-681 ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. 'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు' అని తన ఇంటి గేటుకు ఫ్లెక్సీని కట్టించారు. ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, అది వజ్ర యుధం వంటిదని, దాన్ని అమ్ముకుని ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును పొగోట్టుకోలేమని అందులో రాయించాడు. ఓటు విలువను వివరిస్తూ మాస్టారు ఏర్పాటు చేయించిన ప్లెక్సీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఫ్లెక్సీ గురించి అడిగితే.. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అగౌరవ పరిచినట్లే అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు కావడం గమనార్హం.

ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా మంది తమకు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. అందుకోసం మాకు డబ్బులు ఇస్తామని ఆశ చూపే ప్రయత్నం చేస్తున్నారు. మా ఇంట్లో మేమంతా చదువుకున్నవాళ్లమే.. కనుక ఓటును డబ్బుల కోసం అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాం. నీనే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే పట్టభద్రులు, టీచర్లు ఓటు వేసే ముందు ఆలోచించండి. నల్లపల్లి విజయ భాస్కర్, ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు

''మా ఇంటి ఓట్లు అమ్మబడవు భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆయుధం ఓటు హక్కు, నిజాయితీగా ఉండి ప్రజలు, ఉద్యోగుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తికే మేము ఓటు వేస్తాము. ఓటును అమ్ముకొని మా ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును పొగొట్టుకోము.'' అంటూ ఫ్లెక్సీలో వెల్లడించారు.

డబ్బులకు ఓటు అమ్ముకోవద్దంటున్న విజయభాస్కర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.