ETV Bharat / state

స్టీలు పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయండి: జేసీ ప్రభాకర్ రెడ్డి

author img

By

Published : Oct 30, 2020, 4:45 PM IST

jc prabhakar reddy
jc prabhakar reddy

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం బొందలదిన్నె, వంగనూరు రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం రైతులు భూములిచ్చారని.. పరిశ్రమ వెనక్కి వెళ్లినందున భూములు తిరిగి ఇవ్వాలన్నారు. రైతులు నష్టపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెప్పినా స్పందించటం లేదని విమర్శించారు.

స్టీలు పరిశ్రమ కోసం రైతులు భూములిచ్చారే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 2008లో తాడిపత్రి మండలం బొందెలదిన్నె, వంగనూరు గ్రామల రైతులు వశిష్ట ఇస్పాట్ లిమిటెడ్ సంస్థకు ఎకరా భూమిని లక్ష 20 వేల రూపాయల చొప్పున ఇచ్చారని ఆయన చెప్పారు. ఆ సంస్థ రైతుల నుంచి సేకరించిన భూముల్లో పరిశ్రమ ఏర్పాటు చేయకుండా, బ్యాంకులో తనఖాపెట్టి రుణాలు పొందిందన్నారు. రుణాలు తిరిగి చెల్లింపులో విఫలం కావటంతో..బ్యాంకు ఆ భూములను వేలం వేయగా స్థిరాస్తి సంస్థ కొనుగోలు చేసిందన్నారు.

పరిశ్రమ ఏర్పాటు చేయకపోవటం వల్ల ఆ భూములను తిరిగి రైతులకు వెనక్కి ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం వేలంలో కొనుగోలు చేసిన ధర కంటే ఎకరాకు 20 వేల రూపాయుల అదనంగా చెల్లించటానికి సిద్దగా ఉన్నారన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి రైతుల పక్షాన నిలబడాలని, ఆయనకు ఏ భాషలో చెప్పినా అర్థం కావటంలేదని ప్రభాకర్​రెడ్డి ఆరోపించారు. రైతుల విజ్ఞప్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవస్థను చక్కదిద్దే యత్నం చేస్తున్నారని, ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇప్పటివరకు జరిగిన స్థానికల ఎన్నికల ప్రక్రియను రద్దు చేయటానికి కమిషనర్ యత్నిస్తున్నారన్నారు.

ఇదీ చదవండి

క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల ఆకస్మిక దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.