ETV Bharat / state

Police Drinking At Ps: అక్కడ తాగితే ఎవరూ పట్టించుకోరనుకున్నారు.. కానీ వీడియో వైరలయ్యింది..

author img

By

Published : Mar 16, 2022, 8:30 PM IST

Police Drinking at PS Video: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని కంట్రోల్​ చేయాల్సిన పోలీసులే మద్యం తాగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్​ అవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా మద్యం తాగుతున్న వారిని బెదిరించి మరీ వారితో మద్యం తెప్పించుకుని తాగడం వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పీఎస్​లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్​గా మారింది.

Police Drinking at PS
Police Drinking at PS

Police Drinking at PS Video: అక్కడ మద్యం తాగితే ఎవరూ పట్టించుకోరులే అనుకున్నారేమో ఆ ఖాకీలు.. గుట్టు చప్పుడు కాకుండా మద్యం తాగారు. కానీ వారు మద్యం తాగుతున్నప్పుడు తీసిన వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్​ కావడంతో ఒక్కసారిగా షాక్​ గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పీఎస్​లో నాలుగు రోజుల క్రితం జరిగింది. ఉరవకొండ పీఎస్​ పోలీసులు నాలుగు రోజుల క్రితం బహిరంగంగా మద్యం తాగుతున్న యువకులని పట్టుకొని వారి వద్ద నుంచి డబ్బు లాక్కొని..బెదిరించి.. వారి తోనే మద్యం తెప్పించుకున్నారని తెలుస్తోంది. స్టేషన్​కు మద్యం తెప్పించుకున్న వారు పోలీస్ స్టేషన్ పైన గదిలో మద్యం తాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు మద్యం తాగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్​గా మారింది. ఆ కానిస్టేబుళ్లు తరచూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై స్థానిక పోలీసు అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.

స్టేషన్ లోనే మద్యం తాగుతున్న పోలీసులు...సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్..

ఇదీ చదవండి : Canara Bank Cheating: కెనరా బ్యాంకు అధికారుల మోసం...రుణాలిచ్చి బురిడి కొట్టించారు -బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.