ETV Bharat / state

బిందెడు నీటి కోసం.. బండెడు కష్టం.. మహిళల మధ్య 'కన్నీటి' యుద్ధం.. మన రాష్ట్రంలోనే!

water problem in Anantapur: వైసీపీ నాయకుల పేరు పెట్టుకున్న కాలనీలో సమస్యలు తిష్ట వేశాయి. వేసవిలో తాగునీటి కోసం కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓట్ల కోసం కాలనీకి వచ్చే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని శివరామరెడ్డి కాలనీలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలపై కథనం.

water problem in Anantapur
water problem in Anantapur
author img

By

Published : Mar 27, 2023, 12:08 PM IST

water problem in Anantapur: ప్రజా ప్రతినిధులు, అధికారులు తాగునీటి సరఫరాను మెరుగు పరుస్తున్నామని.. ఇంటింటికి తాగునీటి కొళాయిని అందిస్తున్నామని చెప్తున్నారు. కాని ఆచరణలో మాత్రం అడుగుపడటం లేదు. అధికారుల మాటలకు పొంతన లేకుండా పోతోంది. ప్రజలు బిందెడు నీటి కోసం.. బండెడు కష్టాన్ని పడాల్సి వస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో శివరామిరెడ్డి కాలనీలో.. వైసీపీ ఎమ్మెల్సీగా శివరామిరెడ్డి ప్రస్తుతం పట్టణంలో నివాసం ఉన్నారు. ఏనాడు కాలనీల ప్రజలు సమస్యలను విన్నది లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరామిరెడ్డి కాలనీలో 400 వరకు నివాస గృహాలు ఉన్నాయి. 2 వేల వరకు జనాభా ఉన్నారు. మరో మూడు కాలనీల్లో ఒకటి రెండు చోట్ల పబ్లిక్ కొళాయిలు ఉన్నాయి. వాటికి నాలుగైదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయి. అవి కూడా ఓ అరగంటకు మించి రాని పరిస్థితి. నిత్యం కూలీనాలీ చేసుకునే స్థానికులు ఆ నీటిని పట్టుకోవడానికి పడే ఇబ్బందులు వర్ణానాతీతం. ఒక్కో కుటుంబానికి ఐదు లేదా ఆరు బిందెల నీళ్లు దొరకడం కూడా కష్టమే. వాటినే మూడు నాలుగు రోజులు వాడుకోవాలి.

కొళాయిలకు నీరు సరఫరా అయినపుడు వచ్చిరాని నీటిని పట్టుకోవడానికి స్థానిక మహిళల మధ్య పెద్ద 'కన్నీటి' యుద్ధమే చోటు చేసుకుంటుంది. గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ అలాంటి పరిస్థితి తీవ్రం అవుతోంది. దీనిని చూస్తున్న ఆర్​డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు మాటలతో సరి పెడుతున్నారు. ఆ కాలనీ జనాలకు తగినట్లుగా పైపులైన్లు నిర్మించడం గాని.. కొళాయిలను ఏర్పాటు చేయడం గాని చేయలేదు. నీటి కోసం ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టిన పాపాన పోలేదని కాలనీ ప్రజలు వాపోతున్నారు. నిత్యం అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం నీటి సరఫరాను మెరుగు పరిచామని, ఎక్కడ సమస్య ఉన్నా ఇట్టే తీరుస్తామన్నట్లు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కాలనీల్లో మాత్రం నీటి సమస్యను పరిష్కరించక పోగా.. స్థానికులు దానిని అధికారులు దృష్టికి తెచ్చినా పట్టించుకునే వారు లేరు.

ఆర్​డబ్ల్యూఎస్ అధికారులు ఆ కాలనీ వైపు కన్నెత్తి చూడడం లేదన్న వాదన ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయిలు ఇస్తున్నామని చెప్తున్నా వారు.. ఆ కాలనీలో మాత్రం ఎలాంటి చర్యలను చేపట్టలేదు. అక్కడి పేదలు నీటిని కొని తాగడం కష్టమని తెలిసినా.. నీటి సరఫరా మెరుగుకు పంచాయతీ అధికారులు చొరవ చూపిన దాఖలాలు లేవు. గతంలో అక్కడి పైపులైన్ల నిర్మాణానికి రూ. 6లక్షలు కేటాయించినట్లు పంచాయతీలో తీర్మానాలు చేసిన సందర్భమూ ఉంది. ఆచరణలో మాత్రం నీటి అభివృద్ధి పనులు అక్కడ జరుగ లేదు. వేసవి ప్రారంభం కావడంతో అక్కడ నీటి సమస్య మరింత జఠిలం కానుంది. జిల్లా ఉన్నతాధికారులైన స్పందించి శివరామిరెడ్డి కాలనీలో నీటి సరఫరాను మెరుగు పరుచాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.