ETV Bharat / state

Rains in Anantapur district : అనంతలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి

author img

By

Published : Nov 25, 2021, 10:43 PM IST

Updated : Nov 26, 2021, 3:54 PM IST

అనంతపురంలో భారీ వర్షాలు
అనంతపురంలో భారీ వర్షాలు

అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు(Heavy Rains in Anantapur district) బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి శంకర్ నారాయణ, కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు.

అనంతపురం జిల్లాలో వర్షాలతో నష్టపోయిన పంట పొలాలు, ఇళ్లను మంత్రి శంకర్ నారాయణ, కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(chitravathi balancing reservoir) గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు దిగువన ఉన్న.. లక్షుంపల్లి, గొడ్డుమర్రి గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కదిరిలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంత్రి పరిశీలించారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ వైకాపా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

నిండుకుండలా పేరూరు..
20ఏళ్ల తరువాత పేరూరు జలాశయం(peruru project) గేట్లు తెరిచి.. నీటిని దిగువకు విడుదల చేశారు. కర్ణాటకలో కుంభవృష్టి వర్షాలు కురవటంతో అక్కడి ప్రాజక్టులన్నీ నిండిపోయాయి. ఫలితంగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయడంతో జిల్లాలోకి భారీగా ప్రవాహం వస్తోంది. దీంతో.. అప్పర్ పెన్నానదిపై నిర్మించిన పేరూరు జలాశయం నిండుకుండలా మారింది.

నదిలో మునిగి వ్యక్తి మృతి..
హిందూపురం పట్టణ సమీపంలోని పెన్నా నది ప్రాజెక్టు (one man death to fell down into penna river)లో ఈతకు వెళ్లి నరేంద్ర అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. పరిగి మండలం కోనాపురం గ్రామానికి చెందిన నరేంద్ర ఈత కొట్టేందుకు నదిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది.

ఇవీచదవండి.

Last Updated :Nov 26, 2021, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.