ETV Bharat / state

సత్యసాయి ఉన్నత మార్గం చూపారు: నితిన్ గడ్కరీ

author img

By

Published : Nov 23, 2019, 3:22 PM IST

సత్యసాయి బాబా 94వ జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ హాజరయ్యారు. సత్యసాయి బాబా ప్రపంచానికి ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపించారని నితిన్ గడ్కరీ  అన్నారు. సత్య సాయి ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలు వెలకట్టలేనివన్నారు

సత్యసాయి జయంతి వేడుకల్లో నితిన్​ గడ్కరీ

సత్యసాయి జయంతి వేడుకల్లో నితిన్​ గడ్కరీ

సత్యసాయి బాబా 94వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఉదయం వేదపారాయణంతో జయంతి వేడుకలను ప్రారంభించారు. సత్యసాయి బాబా ప్రపంచానికి ఒక ఉన్నతమైన మార్గాన్ని చూపించారని నితిన్ గడ్కరీ అన్నారు. సత్యసాయి ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలు వెలకట్టలేనివన్నారు. ఈ కార్యక్రమంతో ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో పుట్టపర్తి కిటకిటలాడింది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.