ETV Bharat / state

ఓ వర్గంపై కక్ష తీర్చుకునేందుకే ఈ చట్టం

author img

By

Published : Dec 18, 2019, 11:31 AM IST

కదిరిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.

muslims protest at anantapur
ప్లకార్డులతో ప్రదర్శనగా నిరసన తెలుపుతున్న ముస్లింలు

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ముస్లిం, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఓ వర్గంపై కక్ష తీర్చుకునేందుకే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రజానాయకులు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు మిన్నంటాయని అన్నారు. నిరసనలు తెలుపుతున్న వారిపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆందోళనకారులు తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... పట్టణంలోని జాతీయ రహదారిపై ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసనలు ఆపమని... ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

ఓ వర్గంపై కక్ష తీర్చుకునేందుకే ఈ చట్టం..

ఇదీచూడండి.అనంతపురం జిల్లా పర్యటనకు చంద్రబాబు

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_17_Muslimsanghala_Ryally_Oppose_Nrc_AV_AP10004


Body:పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ముస్లిం, ప్రజా సంఘాల నాయకులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఓ మతానికి చెందిన వారిపై కక్ష తీర్చుకునే అందుకే ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తుందని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు మిన్నంటాయని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. నిరసనలు తెలుపుతున్న వారిపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆందోళనకారులు తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని జాతీయ రహదారిపై ప్రదర్శన సాగింది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.