ETV Bharat / state

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం... ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యం

author img

By

Published : Aug 5, 2019, 2:56 PM IST

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందటానికి అనువైనది... ప్రకృతి వ్యవసాయమని రాష్ట్ర వ్యవసాయశాఖా ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి అన్నారు. రాప్తాడులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తోటలను ఆయన పరిశీలించారు.దీనికి తోడ్పాటును ప్రభుత్వం ఇస్తుందన్నారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం... ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యం

అనంతపురం జిల్లా రాప్తాడులో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి పర్యటించారు. బసంపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగరాజు తోటలను ఆయనతో పాటుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు.రెండు ఆవులతో ఏడు ఎకరాలు సాగు చేస్తున్న రైతును అందరు నిదర్శనంగా తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో లాభదాయకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని రైతు నాగరాజు దీంతో మంచి ఆదాయం వస్తుందన్నారు. తనతో పాటు గ్రామంలో రైతులు అందరు ప్రకృతి వ్యవసాయానికి మొగ్గుచూపుతున్నారన్నారు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం... ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యం

ఇవీ చదవండి

గోశాలలోని ఆవులకూ రక్షణ కరువే..!

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.