ETV Bharat / state

పేదల వైద్యం కోసం.. కియా యాజమాన్యం సేవలు అభినందనీయం: మంత్రి శంకర్ నారాయణ

author img

By

Published : Aug 5, 2021, 8:46 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. డ్రై షెల్టర్​ నిర్మాణంతో పాటు సిమెంట్ రోడ్డు, అత్యాధునిక వైద్య పరికరాలను కియా పరిశ్రమల యాజమాన్యం అందించింది. ఇందుకోసం రూ.50లక్షలను ఆ సంస్థ వెచ్చించింది. రాష్ట్ర రహదారులు భవనాల మంత్రి శంకర్ నారాయణ సంతోషం వ్యక్తం చేశారు.

మంత్రి శంకర్ నారాయణ
మంత్రి శంకర్ నారాయణ

నిరుపేదల వైద్య సేవల కోసం కియా పరిశ్రమ ప్రతినిధులు అత్యాధునిక పరికరాలు అందించినందుకు రాష్ట్ర రహదారులు భవనాల మంత్రి శంకర్ నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా డ్రై షెల్టర్​ నిర్మాణంతో పాటు సిమెంట్ రోడ్డు, అత్యాధునిక వైద్య పరికరాలను కియా పరిశ్రమల యాజమాన్యం అందించింది. ఇందుకోసం రూ.50లక్షలను ఆ సంస్థ వెచ్చించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్ హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలకు పెద్ద పీట వేసిందని, ప్రతి గ్రామంలోనూ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి సరైన సమయంలో పేదలకు వైద్యం అందించే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. కరోనా సమయంలోనూ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించామని ఆయన చెప్పారు. వైద్య పరికరాలు అందించిన కియా కార్ల పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులను మంత్రి, కలెక్టర్​ ఘనంగా సన్మానం చేశారు. కియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్లీ, పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జగదీష్ బాబు, సిబ్బంది ,పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

AP CORONA: రాష్ట్రంలో కొత్తగా 2,145 కరోనా కేసులు, 24 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.