ETV Bharat / state

ఇంటి ఇంటి సర్వే చేసి..రోగులను గుర్తించండి

author img

By

Published : May 15, 2021, 6:02 PM IST

కరోనా ఉద్ధృతి, జాగ్రత్తలపై మంత్రి శంకరనారయణ అనంతపురం జిల్లా పెనుకొండలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటి ఇంటి సర్వే చేసి కరోనా బాధితులను గుర్తించి వారికి.. వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.

minister shankar narayana meeting with officials on corona at  penukonda
సమావేశానికి హాజరైన అధికారులు

కరోనా వైరస్ పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో సబ్ కలెక్టర్ నిషాంతి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 5 మండలాల అధికారులతో మంత్రి శంకర్ నారాయణ సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నందున తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే ఇంటి ఇంటి సర్వే చేసి కరోనా బాధితులను గుర్తించి వారికి.. వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. సర్వేలో జ్వరం, జలుబు ఉండేవారిని వెంటనే ఆశావర్కర్ల, ఏఎన్ఎంలు ద్వారా గుర్తించి వారికి చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5మండలాల తాహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.

అతి తీవ్ర తుపానుగా 'తౌక్టే'.. ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.