ETV Bharat / state

ఎస్​ఈసీ నిమ్మగడ్డపై మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం

author img

By

Published : Feb 6, 2021, 4:46 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. ఒక పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారని ఎస్​ఈసీపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

minister shankar narayana laid foundation stone for hospital building in penukonda
పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో భవన నిర్మాణానికి మంత్రి శంకర్ నారాయణ భూమిపూజ

అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.3 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల భవనానికి.. మంత్రి శంకర్ నారాయణ భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అధికారి నియంతలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ.. వారికి లబ్ధి చేకూర్చడానికే ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు.

ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యోగులు, ప్రజలను ఎస్​ఈసీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యస్ఫూర్తికే విరుద్ధమంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​పై మండిపడ్డారు. ఒకపక్క ప్రజల స్వేచ్ఛను హరిస్తూ.. నియంతృత్వ పోకడలతో ఎన్నికలు నిర్వహించడం సమంజసమేనా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం: ఎస్పీ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.