ETV Bharat / state

ఇంతకీ జేసీ ఎక్కడ.. నాలుగు గంటలుగా ఆచూకీ చెప్పని పోలీసులు

author img

By

Published : Feb 9, 2023, 4:24 PM IST

JC Prabhakar Reddy Arrest : పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెద్దపప్పురు దగ్గర పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేసున్నారంటూ మీడియాతో పరిశీలించారు. ఇసుక తవ్వకాల అనుమతి ఉంటే చూపాలంటూ ప్లకార్డు పట్టుకొని టీడీపీ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పెన్నానదిలోకి వచ్చారంటూ పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలో పలుచోట్లకు తిప్పుతున్నారు.

Etv Bharat
Etv Bharat

JC Prabhakar Reddy Arrest : ఓ వైపు ఇసుక తవ్వకాలు.. ఇంకోవైపు టీడీపీ శ్రేణుల నిరసన మధ్య పోలీసులు హైడ్రామా నడిపారు. మీడియా ప్రతినిధులతో కలిసి ఇసుక తవ్వకాల వద్దకు వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని.. సుమారు 4గంటల పాటు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. తాను మందులు వేసుకోవాలని జేసీ ప్రాథేయపడినా పట్టించుకోలేదు. నిరసనలో పాల్గొన్న మరో 18 మంది జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను, నాలుగు వాహనాలను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్​కు తరలించారు.

భారీగా గోతులు పెట్టి అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోరా..? అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను నిలదీశారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో రెండు వారాల క్రితం అశ్వర్థం ఆలయానికి వచ్చిన ఇద్దరు కర్ణాటక భక్తులు పెన్నానదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. దీనిపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. అక్రమంగా ఇసుక తవ్వతున్నారంటూ మీడియా ప్రతినిధితులతో కలిసి పెద్దపప్పూరు వద్ద పెన్నానదిలో ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో గోతులు పెట్టి భారీ యంత్రాలతో ఇసుక తోడుతున్న తీరును మీడియాకు చూపించారు.

ఇసుక తవ్వకానికి అనుమతి లేకపోయినా, వందలాది టిప్పర్లు రోజూ ఇసుక తవ్వి తరలిస్తున్నారంటూ విమర్శించారు. ఇసుక రీచ్ అనుమతులు చూపాలని లేకపోతే బాధ్యులపై కేసులు పెట్టాలంటూ పెద్దపప్పూరు ప్రధాన రహదారిపై బైఠాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. టీడీపీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కాగా, అనుమతి లేకుండా పెన్నానదిలోకి రావటమే కాకుండా, ఆందోళన చేస్తారా..? అంటూ పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మైనింగ్ అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని జేసీ పట్టుబట్టటంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు.

జేసి ప్రభాకర్ రెడ్డి నిరసన

పెన్నాలో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. ఐదు ప్రొక్లెయిన్లు, లారీలతో ఇసుక తవ్వుతున్నారు.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేం ఆందోళన చేయడం లేదు... అడుగుతున్నాం అంతే. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వచ్చి పర్మిషన్ ఉందని చెప్పమనండి - జేసీ ప్రభాకర్ రెడ్డి, తెదేపా మున్సిపల్ ఛైర్మన్, తాడిపత్రి

జేసీని వాహనంలో తరలించిన పోలీసులు.. ఎక్కడా స్టేషన్​లో ఉంచకుండా, వ్యక్తిగత గన్ మెన్​ను కూడా వాహనం నుంచి కిందకు దించేసి, జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో దాదాపు నాలుగు గంటలపాటు వాహనంలోనే తిప్పారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎక్కడికి తీసుకుపోతున్నారో కనీసం జేసీ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వని పోలీసులు.. తాను మందులు వేసుకోవాలని జేసీ ప్రాథేయపడినా పట్టించుకోలేదు. నిరసనలో పాల్గొన్న మరో 18 మంది జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను, నాలుగు వాహనాలను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్​కు తరలించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.