ETV Bharat / state

'అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'

author img

By

Published : Aug 7, 2020, 3:43 PM IST

Updated : Aug 7, 2020, 4:29 PM IST

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే రాజధానిగా ప్రకటిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. జైలులోనూ తనను ఇబ్బంది పెట్టేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని ఆరోపించారు.

jc prabhakar reddy
jc prabhakar reddy

జేసీ ప్రభాకర్​ రెడ్డితో ముఖాముఖి

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటిస్తే ముఖ్యమంత్రి జగన్​కి శాలువా కప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెదేపా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగంపై 54 రోజుల పాటు కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. గురువారం బెయిల్​పై విడుదలయ్యారు. జైలులో తనకు ఎదురైన అనుభవాలను ఈటీవీ భారత్​కు వివరించారు.

నేను జైలులో ఉన్నా కొందరు నాపై కక్ష సాధింపులు మానుకోలేదు. బెడ్ ఇవ్వకూడదని, సరైన ఆహారం అందించకూడదని అధికారులపై కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... అమరావతి నుంచి ఒత్తిడి తెచ్చారు. కానీ జైలు అధికారులు, సిబ్బంది నాకు సహకరించారు. తప్పుడు అభియోగాలతో నన్ను అరెస్ట్ చేశారు. అసలు నాకు ఎన్ని వాహనాలు ఉన్న విషయం కూడా తెలియని నా కుమారుడు జేసీ అస్మిత్​రెడ్డిని కూడా ఈ కేసులో ఇరికించారు- జేసీ ప్రభాకర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

కరోనా, లాక్​డౌన్​తో తాడిపత్రిలోని పేదలు ఇబ్బంది పడకుండా... అందరికీ పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో అమలు చేస్తామని జేసీ ప్రభాకర్​ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆస్మిత్​ రెడ్డి సహా 31 మందిపై కేసు

Last Updated : Aug 7, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.