ETV Bharat / state

అనంత రైతులను సీజన్‌ ఆరంభంలోనే ముంచిన వర్షాలు

author img

By

Published : Jul 25, 2021, 3:14 PM IST

నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. అనంతపురం జిల్లా రైతులకు తీవ్ర నష్టం కలిగింది. 300 హెక్టార్లలోని పంటలు మొక్కదశలోనే.. దెబ్బతిన్నాయి. కనీసం పశువుల మేతకూ పనికిరాకుండా పోయిందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

heavy rains in anantapuram
ముంచిన వర్షాలు

రైతులను సీజన్‌ ఆరంభంలోనే ముంచిన వర్షాలు

వర్షం కోసం ఎప్పడూ ఆకాశానికేసి ఆశగా చూసే అనంతపురం జిల్లా రైతులను... ఈసారి వర్షాలే దెబ్బతీశాయి. ఈనెలలో కదిరి, బెలుగప్ప, బుక్కరాయ సముద్రం, ధర్మవరం మండలాల్లో రికార్డుస్థాయిలో వర్షాలు కురిశాయి. 300 హెక్టార్ల మేర.. వేరుశనగ, వరి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం తదితర పంటలకు నష్టం వాటిల్లింది. 25 నుంచి 40 రోజుల క్రితం.. మొలకెత్తిన పంటలు మొక్కదశలోనే నాశనం చేశాయి. కొన్నిప్రాంతాల్లో పంటలు ప్రవాహంలో కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల నీరు రెండు రోజుల పాటు నిల్వ ఉండి కుళ్లిపోయాయి.

ఇరవై ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి వర్షాలు చూడలేదని..పైర్లు పశువుల మేతకూ పనికిరాకుండా పోయాయని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో గతేడాది నష్టాలను ఈసారి పూడ్చుకుందానే ఆశతో సాగు చేస్తే.. సీజన్ ఆరంభంలోనే కష్టం తుడిచిపెట్టుకుపోయిందని వాపోతున్నారు. మొక్క దశలో నాశనమైన పంట నష్టం అంచనా వేసేందుకు.. జిల్లా అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. ప్రభుత్వం అనుమతిస్తేనే.. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లభిస్తుంది.

ఇదీ చదవండి:

Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

కర్ణాటకలో వరదల బీభత్సం- 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.