ETV Bharat / state

Garment Workers Strike on Power Cuts: అప్రకటిత కరెంట్ కోతలపై 'గార్మెంట్​' కార్మికుల ఆగ్రహం.. విద్యుత్ శాఖ కార్యాలయం ముట్టడి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 12:23 PM IST

Garment Workers Strike on Power Cuts: కరెంటు సరఫరా సక్రమంగా చేయాలంటూ.. విద్యుత్ శాఖ కార్యాలయాన్ని గార్మెంట్స్ కార్మికులు ముట్టడించారు. గత ఆరు నెలలుగా కాలనీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని.. రాయదుర్గం ఏఈఈ బాలచంద్రకు విన్నవించుకున్నారు.

Garment_Workers_Strike_on_Power_Cuts
Garment_Workers_Strike_on_Power_Cuts

Garment Workers Strike on Power Cuts: అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరెంటు సరఫరా సక్రమంగా చేయాలంటూ.. విద్యుత్ శాఖ కార్యాలయాన్ని శుక్రవారం పార్వతీ నగర్ గార్మెంట్స్ కార్మికులు ముట్టడించారు. గత ఆరు నెలలుగా కాలనీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని.. రాయదుర్గం ఏఈఈ బాలచంద్రకు విన్నవించుకున్నారు. నిరంతరాయంగా కరెంట్ పోతూ.. వస్తూ ఉందని, ఏ సమయంలో కరెంట్ వస్తుందో.. ఏ సమయంలో పోతుందో తెలియట్లేదని వాపోయారు.

Protest on Current Supply in Rayadurgam: విద్యుత్ కోతల వల్ల తాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా గార్మెంట్స్ పరిశ్రమ ముందుకు సాగడంలేదని తెలిపారు. దీంతో పరిశ్రమ మూతపడి కార్మికులు బెంగళూరు, హైదరాబాద్, బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి ఎద్దడి నెలకొందని, ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు వాపోయారు.

Crop Damage Due To Power Cuts in AP: అప్రకటిత విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు

Protest on Power Cuts in Ananthapuram District: రాయదుర్గం మండలంలో శుక్రవారం రాత్రి 7నుంచి 11వరకు విద్యుత్ సరఫరా ఆగిపోయి.. గ్రామాలన్నీ అంధకారంగా మారాయని స్థానికులు వాపోయారు. నాలుగు గంటలకు పైగా చీకట్లో ఉక్కపోతతో మగ్గిపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకొని కాలనీలో అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోతలు విధించకుండా విద్యుత్ సరఫరా చేసి తమ జీవితంలో వెలుగులు నింపాలని వారు విజ్ఞప్తి చేశారు.

"రాయదుర్గంలో కరెంటు సరఫరా సక్రమంగా లేదు. గత ఆరు నెలలుగా కాలనీలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నాము. విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటేనే మాకు ఉపాధి ఉంటుంది. అప్రకటిత కోతల వల్ల గార్మెంట్స్ పరిశ్రమ ముందుకు సాగడం లేదు. దీనివల్ల పరిశ్రమ మూతపడి కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. రాయదుర్గం మండలంలో శుక్రవారం రాత్రి 7నుంచి 11వరకు విద్యుత్ సరఫరా ఆగిపోయి.. గ్రామాలన్నీ అంధకారంగా మారాయి. నిరంతరాయంగా కరెంట్ పోతూ.. వస్తూ ఉంది. ఏ సమయంలో విద్యుత్ వస్తుందో.. ఏ సమయంలో పోతుందో తెలియట్లేదు. నాలుగు గంటలకు పైగా చీకట్లో ఉక్కపోతతో మగ్గిపోయాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కాలనీలో అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి.. కోతలు విధించకుండా విద్యుత్ సరఫరా చేసి మా జీవితంలో వెలుగులు నింపాలని కోరుతున్నాము." - గార్మెంట్స్ కార్మికుల ఆవేదన

Farmers Faces Problems Due to Power Cuts: అప్రకటిత విద్యుత్ కోతలు.. ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.