ETV Bharat / state

fire accident near jntu: జేఎన్‌టీయూ సమీపంలో అగ్నిప్రమాదం

author img

By

Published : Sep 2, 2021, 7:35 AM IST

Updated : Sep 2, 2021, 8:51 AM IST

fire accident
fire accident

అనంతపురం జేఎన్‌టీయూ సమీపంలోని సూపర్ మార్కెట్​లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. కాగా ఆ సూపర్ మార్కెట్​ ఈ రోజే ప్రారంభం కావాల్సి ఉంది.

అనంతపురంలో నూతనంగా ప్రారంభం కావాల్సిన పవిత్ర హైపర్ మార్ట్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవాళ ప్రారంభించనుండడంతో... సిబ్బంది రాత్రి రెండు గంటల వరకు దుకాణంలోనే ఉన్నారు. తెల్లవారు జామున ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దుకాణంలో 60 లక్షల వరకు నిత్యవసర వస్తువులు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నూతనంగా ప్రారంభించాల్సిన మార్ట్ అగ్నికి ఆహుతవ్వడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: krmb meeting:వాడివేడిగా కృష్ణాబోర్డు భేటీ.. తెలంగాణకు 34%, ఏపీకి 66% నీటి వాటాలు

Last Updated :Sep 2, 2021, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.