ETV Bharat / state

'అమరావతి'నే కొనసాగించాలంటూ... 'అనంత' నినాదం

author img

By

Published : Jan 19, 2020, 5:53 PM IST

మూడు రాజధానులు వద్దంటూ.. అమరావతే ముద్దంటూ జిల్లాలోని కదిరి, హిందూపురం, గుంతకల్లులో అమరావతి పరిరక్షణ ఐకాస, భాజపా, తెలుగు యువత ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు, నిరాహారదీక్షలు, ప్రజా బ్యాలెట్లు నిర్వహించారు.

రాజధాని అంశంపై అనంతపురంలో ధర్నాలు
రాజధాని అంశంపై అనంతపురంలో ధర్నాలు

రాజధాని అంశంపై తెలుగు యువత... 24 గంటలు నిరసన దీక్ష

అనంతపురం జిల్లా శింగనమలలో రాజధాని అంశంపై తెలుగు యువత కార్యకర్తలు... 24 గంటలు నిరసన దీక్ష చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. విశాఖను రాజధాని చేస్తే... రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు వస్తాయని మండిపడ్డారు. రాయలసీమకు ప్రభుత్వం న్యాయం చేయలన్నారు.

భాజపా పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం

భాజపా పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం

హిందూపురం పట్టణంలోని ఆర్​ అండ్ బీ అతిథి గృహంలో భాజపా పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తూ పాలన సాగాలన్నారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి

రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అమరావతి ఆంధ్రుల రాజధాని అంటూ పెద్ద సంఖ్యలో ప్రజా బ్యాలెట్ ద్వారా రాజధానిగా అమరావతికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

హిందూపురంలో రాజధానిపై అభిప్రాయసేకరణ

హిందూపురం ఇందిరమ్మ సర్కిల్ వద్ద బ్యాలెట్ల రూపంలో రాష్ట్ర రాజధానిపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఐక్య కార్యాచరణ సమితి నిర్వహించింది. ప్రజలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మద్దతు తెలియచేశారు.

గుంతకల్లులో పోస్టల్ బ్యాలెట్

గుంతకల్లులో పోస్టల్ బ్యాలెట్

రాజధాని అంశంపై గుంతకల్లు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాల్గవ రోజు పోస్టల్ బ్యాలెట్​ నిర్వహించారు. ప్రధాన కేంద్రాల్లో మూడు చోట్ల రాజధానిగా అమరావతి ఉండాలా? లేక విశాఖపట్నం ఉండాలా? నిర్ణయించాలంటూ ప్రజా రాజధాని, ప్రజాతీర్పు అంటూ కార్యక్రమం నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్​తో పాటు సీపీఐ నాయకులు, అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం జరిపించారు.

ఇవీ చదవండి:

అమరావతిలో అన్నీ ఉన్నాయి.. ఇంక విశాఖ ఎందుకు?

Intro:రాయలసీమ కు ఇండస్ట్రీస్ అవసరం....

శింగనమల మండల కేంద్రంలో మూడు రాజదానులు వద్దు- ఆమరావతి ముద్దు అను నినాదంతో తెలుగు యువత అద్వర్యంలో నిర్వహించిన 24 గంటల నిరసన దీక్షలో పాల్గొని దీక్ష చేస్తున్న తెలుగు యువత నాయకులకు తమ మద్దతు తెలిపిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ,బండారు శ్రావణి...

ఈ సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ: రాయలసీమ లో ఇండస్ట్రీలు సాగు తాగునీరు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడిని తెచ్చేందుకు యువత ముందుకు రావాలి.రాయలసీమ యువతకు జేసీ పిలుపు రాష్ట్ర రాజదాని విశాఖపట్నం చేస్తే రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.అని అయన అన్నారు. రాయలసీమ కు ఎమి చేస్తారో చొప్పండి రాయలసీమకు హైకోర్ట్ అవసరం లేదు రాయసీమకు కియా సంస్థల్లాంటి మరియు ముఖ్యంగా రాయలసీమకు నీరు అతి ప్రాముఖ్యం ఇవన్నీ ఇవ్వండి.అప్పుడు మీరు రాయలసీమకు న్యాయం చేసినవారవుతారు. ఆమరావతి కన్న ముందు రాయలసీమకు ఎమి ఇస్తారు ఇస్తున్నారు అని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బైట్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి


Body:శింగనమల


Conclusion:కాంట్రిబ్యుటర్ : ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.