ETV Bharat / state

Brutally Murder: అనంతపురంలో దారుణం.. కొడవలితో గొంతుకోసి వ్యక్తి హత్య

author img

By

Published : Dec 18, 2021, 10:55 AM IST

Brutally murder At Anantapur: అనంతపురం రూరల్ కామరపల్లి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొడవలితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

a man Brutally murder At Anantapur
అనంతపురంలో వ్యక్తి దారుణ హత్య

A man brutally murdered at Anantapur: అనంతపురం రూరల్ కామరపల్లి సమీపంలో రాజేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొడవలితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తాపీ పని చేసే రాజేష్‌కు.. కొన్నేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై గతంలో గొడవలు కూడా జరిగాయని స్థానికులు అంటున్నారు.

ఉదయం పనికి వెళ్లే సమయంలో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి..

Accident News: ప్రకాశం జిల్లాలో వేర్వేరు ప్రమాదాలు.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.