ETV Bharat / state

పామాయిల్‌ తోటలో కింగ్​ కోబ్రా.. బాబోయ్​ ఎంత పొడవంటే..!

author img

By

Published : Oct 19, 2022, 4:08 PM IST

Updated : Oct 19, 2022, 4:18 PM IST

King cobra
కింగ్ కోబ్రా కలకలం

14 feet Snake: పని కోసం పామాయిల్​ తోటకు వెళ్లిన కూలీలు షాక్​కు గురయ్యారు. 14 అడుగుల కింగ్​కోబ్రాను చూసి పరుగులు తీశారు. అనంతరం స్నేక్‌ క్యాచర్స్​కు సమాచారమివ్వగా.. పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

14 Feets King Cobra: ప్రపంచంలోనే అతి విషపూరితమైన కింగ్ కోబ్రా అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో కలకలం రేపింది. పామాయిల్ తోటలో కూలీలు గెలలు కోస్తుండగా వారికి కనిపించింది. భారీ పామును చూసిన కూలీలు భయభ్రాంతులతో పరుగులు తీశారు. స్నేక్​ క్యాచర్స్​కు సమాచారం అందించారు. సభ్యులు వెంకటేష్, మూర్తి సంఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి.. కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు 14 అడుగుల వరకు ఉండొచ్చని తెలిపారు.

ఈ కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాము అని అన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం వీటిని రక్షించుకోవాలని వన్యప్రాణి సంరక్షణ సభ్యులు సూచించారు. ఓ సంచిలో బంధించిన కింగ్ కోబ్రాను వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.

పామాయిల్‌ తోటలో 14 అడుగుల కింగ్​ కోబ్రా

ఇవీ చదవండి:

Last Updated :Oct 19, 2022, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.