ETV Bharat / state

CBN Uttarandhra tour is over ముగిసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన.. బాబు పర్యటనతో పార్టీ శ్రేణుల్లో జోష్

author img

By

Published : May 20, 2023, 4:47 PM IST

CBN Uttarandhra tour is over చంద్రబాబు చేపట్టిన మూడురోజుల ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతంగా ముగిసింది. బాబు పర్యటనతో స్థానికనేతల్లో నూతనొత్తేజం నెలకొంది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు నమ్మకంగా లేడని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన సంపద గురించి మాత్రమే జగన్ ఆలోచిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

CBN Uttarandhra tour is over: మూడురోజుల ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని...తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనకాపల్లి నుంచి హైదరాబాద్​కు బయలుదేరారు. శుక్రవారం రాత్రి అనకాపల్లిలోనే బస చేసిన ఆయనను పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అభినందించారు. అనకాపల్లి బెల్లంతో తయారుచేసిన దండను చంద్రబాబు నాయుడుకి వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి అభివాదం చేశారు.

అనకాపల్లి బహిరంగసభలో..: ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా...అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పేదలకు సెంటు స్థలాలంటూ మభ్యపెడుతున్న జగన్‌.. టీడీపీ హయాంలో ఇచ్చినట్లు మూడు సెంట్ల స్థలాన్ని మీరు ఇవ్వగలరా అని.. చంద్రబాబు సవాల్‌ చేశారు. అనకాపల్లికి రోడ్లు వేయించడం చేతకాని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ దోపిడీ మాత్రం బాగాచేస్తున్నారని చురకలు అంటించారు. సంపదను సృష్టించి పేదలకు పంచడమే తన నైజమని చంద్రబాబు తెలిపారు.

శుక్రవారం అనకాపల్లిలో రోడ్‌ షో నిర్వహించిన చంద్రబాబు.. రోడ్డు గతుకుల బొంతగా ఉందని విమర్శించారు. ఒక రోడ్డు వేయని కోడిగుడ్డు మంత్రి.. పవన్‌ కల్యాణ్​ని, నన్ను తిడుతుంటాడని... ఈయన విస్సన్నపేటలో 609 ఎకరాలు భూములు హాంఫట్‌ చేశాడని. కొండలు, గెడ్డలు కబ్జాలు చేస్తున్నాడని అన్నారు. ఇతన్ని ప్రజా కోర్టులో పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడు పెట్టుబడిదారుల సదస్సులతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టించి... 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని చెప్పారు. వీరు వచ్చాక ఉన్న కంపెనీలను తరిమేశారని అన్నారు. అదానీ డేటా సెంటర్‌, భోగాపురం ఎయిర్‌పోర్టుకి ఐదేళ్ల క్రితం ఆయన పునాది వేశారని... ఇప్పుడు అధికారంలోఉండుంటే ఇప్పటికే విమానశ్రయం పూర్తయ్యేదని చెప్పారు. అప్పుడు వ్యతిరేకించిన జగన్‌ వారితో కమీషన్లు మాట్లాడుకుని ఇప్పుడు మళ్లీ శిలాఫలకం వేశాడని...అసలు సిగ్గుందా ఈయనకి" అంటూ చంద్రబాబు నిలదీశారు.

అనకాపల్లి సభకు జనం పోటెత్తడంపై హర్షంవ్యక్తంచేసిన చంద్రబాబు... వైసీపీ దొంగలముఠాతో జాగ్రత్తగా ఉండాలని.. సూచించారు.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా బుద్ధి చెప్పాలని..చంద్రబాబు పిలుపునిచ్చారు.

CBN Tweet: విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోని తొలి 5రాష్ట్రాలతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు 14వ స్థానానికి పడిపోవడం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఏ ఒక్క పెట్టుబడిదారుడు నమ్మకంగా లేడని విమర్శించారు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం తన సంపద గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు, యువత భవిత గురించి ఏమాత్రం పట్టట్లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

అనకాపల్లిలో చంద్రబాబుకి ఘనంగా వీడ్కోలు పలికిన టీడీపీ శ్రేణులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.