ETV Bharat / state

తమ భూములు లాక్కున్నారని.. సామూహిక ఉరిలతో గిరిజనుల నిరసన

author img

By

Published : Dec 2, 2022, 3:05 PM IST

TRIBAL PROTEST WITH MASS HANGING: ఒకటి, రెండు కాదు సుమారు 90 ఎకరాల భూమిని అధికారులు.. స్థిరాస్తి వ్యాపారుల పేరు మీద మార్చారని అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఉరివేసుకుంటూ నిరసన తెలిపారు.

TRIBAL MASS HANGING IN ALLURI DISTRICT
TRIBAL MASS HANGING IN ALLURI DISTRICT

TRIBAL PROTEST WITH MASS HANGING IN ALLURI DISTRICT : స్థిరాస్తి వ్యాపారులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై.. తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా.. బూరిగ, చిన్న కోనేల గ్రామాల గిరిజనలు ఆవేదన వ్యక్తం చేశారు. సామూహికంగా ఉరివేసుకుంటూ నిరసన తెలిపారు. 90 ఎకరాల భూములను తమకే తెలియకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పేరు మీద మార్చారని ఆవేదన వ్యక్తంచేశారు.

రైతు భరోసా పథకంలో పేర్లు రాకపోవడంతో అనుమానం వచ్చిన గిరిజనులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అప్పుడే.. రికార్డుల మార్పు వ్యవహారం తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై 2021లో ఐటీడీవో పీవో ఆదేశాల మేరకు సర్వే చేసిన అధికారులు.. ఇప్పటిదాకా గ్రామసభలు నిర్వహించలేదు. ఈలోగా భూమి తమకు అప్పజెప్పాలంటూ.. స్థిరాస్తి వ్యాపారులు.. బెదిరిస్తున్నారని గిరిజనులు వాపోయారు. ఈ నెల ఐదోతేదీన అనంతగిరి రావాలంటూ నోటీసులు పంపారని గిరిజనులు తెలిపారు. గ్రామంలో చాలా మంది వరికోతలకు పశ్చిమ గోదావరిజిల్లా వెళ్లారని,.. ఇప్పటికిప్పుడు రావాలంటే ఎలాగంటూ వాపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.