ETV Bharat / state

Ganja Seized: 840 కిలోల గంజాయి సీజ్.. విలువ కోటి రూపాయలు!

author img

By

Published : May 2, 2023, 12:19 PM IST

Police seized Ganja: 840 కిలోల గంజాయిని.. కార్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?

Ganja Seized
గంజాయి స్వాధీనం

Police seized Ganja: కార్లలో తరలిస్తున్న కోటి రూపాయలు విలువ చేసే 840 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎస్‌ఈబీ సీఐ సంతోష్‌ తెలిపారు. ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం.. సోమవారం ఉదయం ముంచంగిపుట్టు మండలం సుత్తిగుడ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వస్తున్న రెండు కార్ల నుంచి భారీ మొత్తంలో గంజాయిను పట్టుకున్నట్టు చెప్పారు.

సరకును తరలిస్తున్న ముంచంగిపుట్టు మండలానికి చెందిన పలాస విజయ్‌, గిలియ మాంగో అనే ఇద్దరు వ్యక్తులతో పాటు, మహారాష్ట్రకు చెందిన వికాస్‌ ధారాసింగ్‌ జాదవ్‌, రాజేష్‌ నాందేవ్‌ మహతిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఎస్‌ఈబీ ఎస్సై ఫణీంద్రబాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా వారం రోజుల వ్యవధిలో సుమారు 1000 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

కుమార్తె కోసం భార్యను అతి కిరాతకంగా: కుటుంబ కలహాలతో భార్యను అతి కిరాతకంగా భర్త హత్య చేశాడు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలుకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉయ్యూరు ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావుకి గతంలో వివాహం అయి.. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. కోటేశ్వరరావుకి.. బందరు ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరమ్మతో ఏడేళ్ల క్రితం పరిచయం అయింది. ఈవిడ కూడా భర్త నుంచి విడిపోయింది. వీళ్లిద్దరి పరిచయం.. తరువాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అప్పటికే పిల్లలు ఉండగా.. వారిని బంధువుల వద్ద వదిలేసి.. గత ఏడు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

కాగా కోటేశ్వరరావు తన మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను ఇంటికి తీసుకొస్తానని చెప్పడంతో కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఆగ్రహించిన వెంకటేశ్వరమ్మ.. తనకు మొదటి భర్తతో పుట్టిన కుమార్తెను తీసుకొస్తానని చెప్పింది. ఈ విషయమై వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. వెంకటేశ్వరమ్మను ఎలా అయినా అడ్డుతొలగించి.. తన కుమార్తెను ఇంటికి తీసుకురావాలని కోటేశ్వరరావు అనుకున్నాడు. ఆమెను అత్యంత కిరాతకంగా తలపై నరికి.. ఆమె మరణించిన తరువాత అక్కడ నుంచి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీవితకాల జైలు శిక్ష: వరకట్నం కోసం భార్యను వేధించి హత్య చేసిన భర్తకు కోర్టు జీవితకాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అదే విధంగా భార్యను వేధించినందుకు గాను 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాను న్యాయస్థానం అదనంగా విధించింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చందర్లపాడు పోలీస్ స్టేషన్​లో నమోదైన కేసులో.. నిందితుడైన చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన మార్కపూడి రాంబాబు పై నేరం రుజువైనందున నందిగామ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు.. నిందితుడు మార్కపూడి రాంబాబుకు జీవిత కాల జైలు శిక్ష ,10,000 జరిమానా.. అవే విధంగా భార్యను వరకట్నం కోసం వేధించినందుకు 3 సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష 5000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

హత్య: చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం యుఎం పురం చర్చి వద్ద ఓ వ్యక్తిని హత్య చేశారు. మృతుడు పలమనేరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.