ETV Bharat / state

మిగ్​జాం దెబ్బకు అతలాకుతలమైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 10:33 PM IST

Michaung Cyclone Affect in North Andhra and Rayalaseema: మిగ్‌జాం తుపాను ధాటికి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వరి, మిర్చి, అరటి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి కుప్పలు, కల్లాల్లోని ధాన్యం నీటమునగడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేజారిపోయిందని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పలు చోట్ల వాగులు వంకల్లో ఉద్ధృతి పెరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Michaung_Cyclone_Affect_in_North_Andhra_and_Rayalaseema
Michaung_Cyclone_Affect_in_North_Andhra_and_Rayalaseema

మిగ్​జాం దెబ్బకుఅతలాకుతలమైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు

Michaung Cyclone Affect in North Andhra and Rayalaseema: మిగ్‌జాం తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తీవ్ర ప్రభావం చూపింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వేల ఎకరాల్లో వరి, మిర్చి, కంది పంటలు నీట మునిగాయి. చెరువులను తలపిస్తున్న పొలాలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. కోత కోసిన వరి కుప్పలు, మిర్చి పూర్తిగా తడిసిపోయాయి. కల్లాల్లో ధాన్యం, మిర్చి తడిసి రంగుమారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షానికి విశాఖ జిల్లా ములగడలో రెండు ఇళ్ల గోడలు కూలిపోయాయి.

"ఉపాధి ఏమి లేకా వ్యవసాయమే జీవనోపాధిగా చేసుకుని వరి సాగుచేస్తున్నాను. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.5 లక్షల పెట్టుబడితో 20 ఎకరాలు కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. మిగ్​జాంగ్ తుపాను వల్ల చేతికి అందివచ్చిన పంట నీట మునిగిపోయింది. ఈ వర్షాల వల్ల పెట్టిన పెట్టుబడి కూడా రాదు. మమ్మల్ని అధికారులే ఆదుకోవాలి." - ప్రసాద్, విజయనగరం జిల్లా

పంట నీటి పాలైందని మహిళా రైతు కన్నీరు - మనసు చలించే దృశ్యం

Michaung Cyclone Affected in Anakapalli: కుండపోత వర్షానికి అనకాపల్లి జిల్లా చోడవరంలో స్థానిక కోర్టు ప్రాంగణం జలమయమైంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో నీరు కారుతుండటంతో బాలికలను ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. స్థానిక సర్పంచి ఇల్లు ముంపునకు గురైంది. నర్సీపట్నం నుంచి తుని వెళ్లే ప్రధాన రహదారిలో వరద ఉద్ధృతితో వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నక్కపల్లిలోని చేనేత కాలనీ, సమీపంలోని జగనన్న కాలనీ, ఎలమంచిలిలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. వరి పంట చేతికందే దశలో తుపాను దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కుప్పలు, ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు.

"ఈనెల 3న పంట కోసి చేనులో మేరక ప్రాంతంలో ధాన్యం రాసి చేశాను. ఆ తర్వాత నుంచి వర్షాలు కురవడంతో బయటకు తీసుకొచ్చి ఆరబెట్టేందుకు వీలు లేకుండా పోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కుండపోతగా కురిసిన వర్షానికి మొత్తం ధాన్యం రాసి ముంపు బారిన పడింది. బుధవారం కూలీలను ఏర్పాటు చేసుకుని ముంపులో ఉన్న ధాన్యాన్ని నీటిలోంచి దొరికిన ధాన్యాన్ని ఒడ్డుకు తీసుకొచ్చాను." -కోనసీమ జిల్లా రైతు

తుపాను బీభత్సంతో నీటమునిగిన పంటలు - సర్కారు సాయం అందక అన్నదాతల కుదేలు

Michaung Cyclone Affected in Parvathipuram,Alluri: పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపతిపాలెం జలాశయంలో ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. సీతపల్లి వాగు ప్రవాహం పెరిగి రంపచోడవరం, మారేడుమిల్లి, వై. రామవరం మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం-మారేడుమిల్లి రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.

Michaung Cyclone Affected in Prakasam,Nellore: ప్రకాశం, నెల్లూరు జిల్లాలనూ మిగ్‌జాం తుపాను అతలాకుతలం చేసింది. నెల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంట నీటిపాలవగా అరటి, మిరప, బొప్పాయి, కూరగాయల తోటలు నేలవాలాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు లబోదిబోమంటున్నారు. నెల్లూరులోని వైయస్ఆర్ ( YSR), చంద్రబాబు నగర్‌ కాలనీల్లో ఇళ్లలో నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కోవూరులోని జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది.

తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది. నాయుడుపేట, సూళ్లూరుపేట పరిధిలోని గ్రామాల్లో తాగునీటికి ప్రజలు తిప్పలు పడ్డారు. తాగునీటి ప్లాంట్ల వద్ద నీటి క్యాన్లు పట్టుకుని బారులు తీరారు. నాగులగుంట చెరువు తెగి కస్తూర్బా పాఠశాలలోకి వరద నీరు ప్రవేశించింది. 300 మంది బాలికలను ట్రాక్టర్‌లో స్వగ్రామాలకు పంపారు.

"పశ్చిమ గోదావరి మిచౌంగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుంది. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇప్పటికే మిల్లర్లను ఆదేశించాము. ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము." - కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల ​శాఖ మంత్రి

నీటమునిగిన ఆరునెలల కష్టం - ఆందోళనలో అన్నదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.