ETV Bharat / sports

Bhavina Patel News: భవీనాకు గుజరాత్​ సర్కారు భారీ నజరానా

author img

By

Published : Aug 29, 2021, 4:02 PM IST

Updated : Aug 29, 2021, 6:35 PM IST

టోక్యో పారాలింపిక్స్​లో రజత పతకం సాధించిన టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనా బెన్​ పటేల్(Bhavina Patel news)​కు భారీ గిఫ్ట్​ ఇచ్చింది గుజరాత్​ ప్రభుత్వం. రూ. 3 కోట్లు నజరానా ప్రకటించింది.

bhavina
భవీనా పటేల్

టోక్యో పారాలింపిక్స్​లో రజతం సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్​కు(Bhavina Patel) భారీ నజరానా ప్రకటించింది గుజరాత్​ ప్రభుత్వం. రూ. 3 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

గుజరాత్​ మహేసాణా జిల్లాలోని సుంధియా గ్రామానికి చెందిన భవీనా(bhavina patel paralympics).. పారాలింపిక్స్​లో ఆదివారం జరిగిన క్లాస్‌-4 టేబుల్​ టెన్నిస్​ ఫైనల్​ మ్యాచ్(Bhavina Patel Final)​లో చైనా ప్లేయర్​ యింగ్​ ఝోపై 0-3తో ఓడి రజతం సొంతం చేసుకుంది.

పతకం సాధించిన భవీనాను గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందించారు. 'మహేసాణా ముద్దుబిడ్డ.. టేబుల్​ టెన్నిస్​లో పతకం సాధించి దేశం గర్వించేలా చేసింది' అని అన్నారు. 'దివ్యాంగ్ ఖేల్​ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన' కింద భవీనాకు రూ. 3 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు.. భవీనాకు రూ. 31 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(TTFI President) అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ప్రకటించారు.

వారికి అంకితమిస్తున్నా..

"నా ప్రదర్శనపై కొద్దిగా నిరాశతో ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నా స్థాయి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ, వచ్చే టోర్నమెంట్‌లో ఈ లోపాలను సరిదిద్దుకుంటా. ఏ అథ్లెట్ అయినా వంద శాతం ప్రదర్శన ఇస్తే ఓడిపోరు అని నేను నమ్ముతా. నాకు ఎదురయ్యే సమస్యలతో నేనెప్పుడూ కుంగిపోను. ఎందుకంటే ఒక దారి మూసుకుపోతే.. భగవంతుడు మరిన్ని అవకాశాలు ఇస్తాడని నమ్ముతా" అని భవీనా(Bhavina Patel final) తెలిపింది.

"నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ పతకాన్ని అంకితం చేస్తున్నా. పీసీఐ, ఎస్​ఏఐ, టీఓపీఎస్, బ్లైండ్​ పీపుల్ అసోసియేషన్, నా మిత్రులు, కుటుంబసభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మంచి శిక్షణ ఇచ్చిన నా కోచ్​కు కూడా ఈ పతకం అంకితం చేస్తున్నా. ఫిజియో, డైటిషియన్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కూడా నాకు ఎంతగానో ప్రేరణ ఇచ్చారు."

--భవీనా బెన్ పటేల్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి.

సమస్యలను సానుకూల కోణంలో చూడటం నేర్చుకున్నట్లు తెలిపిన భవీనా(Bhavina Patel news) కష్టపడి పనిచేయడానికి ఈ ఆలోచనా విధానమే ధైర్యాన్నిస్తుందని చెప్పింది. టోక్యో ఒలింపిక్స్​ నుంచి చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. వచ్చే పారాలింపిక్స్​లో కచ్చితంగా వంద శాతం మెరుగైన ప్రదర్శన చేస్తానని పేర్కొంది. ​

ఇదీ చదవండి:

Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భవీనా.. భారత్​కు తొలి పతకం

'ఈ విజయానికి దేశమంతా గర్విస్తుంది' - భవీనాకు అభినందనల వెల్లువ

Last Updated : Aug 29, 2021, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.