ETV Bharat / sports

పాక్​లో విరాట్‌ కోహ్లీ సైకత శిల్పం.. కింగ్ ఎక్కడైనా కింగే కదా!

author img

By

Published : Oct 31, 2022, 11:04 AM IST

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్​ ​కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్​ ఉన్నారు. అందులోని పాకిస్థాన్​కు చెందిన ఓ ఫ్యాన్​ వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే..

virat kohlis sand portrait in pakistan
virat kohlis sand portrait in pakistan

భారత బ్యాటింగ్‌ సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఏ వేదికలో మ్యాచ్‌ జరిగినా 'కోహ్లీ.. కోహ్లీ' అనే నినాదాలు వినిపిస్తాయి. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లను చూస్తే అతడి అభిమానగణం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిపోతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లోనూ విరాట్‌కు వీరాభిమానులున్నారు. కాగా పాక్‌లోని బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి.. కోహ్లీపై ఉన్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. స్వతహాగా సైకత శిల్పి అయిన ఆర్‌ఏ గద్దాని.. తన అభిమానాన్నంతా రంగరించి భారీ స్థాయిలో విరాట్‌ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పాక్‌ యాక్టివిస్ట్‌ ఫాజిలా బలోచ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్.. 'కింగ్ ఎక్కడైనా కింగే' కదా అంటూ పోస్టులు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ తలపడగా.. టీమ్‌ఇండియా థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ (82*) వీరోచిత పోరాటంతో భారత్‌ ఆఖరి బంతికి గెలుపొందింది. కోహ్లీ కెరీర్‌లో ఇది అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్‌ విజృంభించాడు. 62 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

ఇవీ చదవండి : ఆ ఒక్కడుంటే టీమ్ ​ఇండియా ఫుల్​ ఫిల్​ అవుతుంది: కపిల్​ దేవ్​

పంత్‌ పాక్‌ జట్టులో ఉండుంటే ఇలా జరిగేదా? : పాక్‌ మాజీ పేసర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.