ETV Bharat / sports

సూర్యకుమార్​, స్మృతి మందాన.. ఆ ఐసీసీ అవార్డుకు నామినేట్

author img

By

Published : Dec 29, 2022, 4:10 PM IST

సూర్యకుమార్​ యాదవ్​, స్మృతి మందాన టీ20ల్లో క్రికెట్ ఆఫ్​ ది ఇయర్​ 2022 అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంకా ఎవరెవరంటే?

Suryakumar Mandhana among nominees for ICC T20 Cricketer of the Year honour
సూర్యకుమార్​, స్మృతి మందాన.. ఆ ఐసీసీ అవార్డుకు నామినేట్

ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా టీ20 క్రికెట్‌లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆట‌గాళ్లకు పురస్కారాన్ని అందించే దిశగా పురుషుల 'టీ20 క్రికెట్ ఆప్ ది ఇయర్-2022' అవార్డుకు నామినేట్​ అయిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ అవార్డు రేసులో న‌లుగురు ఆట‌గాళ్లు ఉండగా.. అందులో టీమ్​ఇండియా న‌యా సంచ‌ల‌నం సూర్య‌కుమార్ కూడా చోటు సంపాదించాడు. ఇంకా ఈ లిస్ట్​లో ఇంగ్లాండ్​ యువ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, పాకిస్థాన్ ఓపెన‌ర్ మహ్మద్​ రిజ్వాన్, జింబాబ్వే ఆల్‌రౌండ‌ర్ సికింద‌ర్ ర‌జా ఉన్నారు.

సూర్యకుమార్ యాదవ్ 2022లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్​లో వెయ్యికిపైగా పరుగులు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది 31 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో.. 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 ప‌రుగులు చేశాడు. అంతేకాదు ఈ పొట్టి క్రికెట్‌లో సూర్య అత్య‌ధికంగా 68 సిక్స్‌లు కొట్టాడు.

ఇకపోతే ఈ ఏడాది టీ20 వరల్డ్​కప్​లో​ అదరగొట్టి ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నీగా నిలిచిన సామ్​ కరన్​.. 19 మ్యాచ్​లు ఆడి 67 రన్స్​తో పాటు 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అత‌డిని రూ.18.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది. జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా 24 మ్యాచ్‌లు ఆడి 735 పురుగులు చేశాడు. 25 వికెట్లు పడగొట్టాడు. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. 25 మ్యాచ్‌లలో 996 పరుగులు చేశాడు. ఇందులో 10 అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఇక మహిళల 'టీ20 క్రికెట్ ఆప్ ది ఇయర్-2022' అవార్డుకు నామినేట్​ అయిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది ఐసీసీ. వీరిలో టీమ్​ఇండియా తరఫున స్మృతి మంధాన ఎంపిక కాగా, మిగతా జట్ల తరఫున పాక్ ఆల్​రౌండర్​ నిదా డర్​, న్యూజిలాండ్​ సోఫీ డివైన్​, ఆస్ట్రేలియా తహ్లియా మెగ్​గ్రత్​ నామినేట్​ అయ్యారు.

ఇదీ చూడండి: నేను రెడీగానే ఉన్నా.. కానీ టీమ్​ మేనేజ్​మెంట్​ అలా చేస్తే..: రిటైర్మెంట్​పై వార్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.