ETV Bharat / sports

'అది ప్లాన్​ కాదు.. బౌలర్లను మానసికంగా దెబ్బ తీసేందుకే అలా ఆడా'

author img

By

Published : Jul 3, 2022, 7:20 AM IST

ఇంగ్లాండ్​తో భారత్​ ఆడుతున్న రీషెడ్యూల్డ్​ టెస్టు.. తొలి ఇన్నింగ్స్​లో చెలరేగి ఎన్నోరికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు టీమ్​ఇండియా ఆటగాడు రిషభ్​ పంత్. ఇంగ్లాండ్​ బౌలర్లను మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎదురు దాడి చేశానని పంత్​ తెలిపాడు. ముందస్తు ప్రణాళికేం కాదని వివరించాడు.

rishabh-panth-about-his-score-and-game-moments
rishabh-panth-about-his-score-and-game-moments

Rishabh Panth: బౌలర్లను మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎదురు దాడి చేశానని పంత్‌ వెల్లడించాడు. ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులతో అతను టీమ్‌ఇండియాను ఆదుకున్నాడు. "ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో ఓ బౌలర్‌ ఉత్తమంగా బౌలింగ్‌ చేస్తున్నాడంటే.. అతని లయను దెబ్బతీయడం చాలా ముఖ్యం. నేనూ అదే అనుకున్నా. ఒకేలా కాకుండా విభిన్న షాట్లు ప్రయత్నిస్తూ బ్యాటింగ్‌ చేస్తా. కొన్ని సార్లు ముందుకు వచ్చి, మరికొన్ని సార్లు బ్యాక్‌ఫుట్‌పై.. ఇలా క్రీజును వాడుకుంటా. ఇదంతా బౌలర్‌ను మానసికంగా దెబ్బతీయడంలో భాగమే. ఇదేదో ముందస్తు ప్రణాళిక కాదు." అని పంత్‌ తెలిపాడు.

"బౌలర్లు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారోననే దానిపై దృష్టి సారించా. ఆరంభంలోనే వికెట్లు పడ్డప్పుడు కుదురుకునేందుకు సమయం తీసుకోవాలి. జడేజాతో భాగస్వామ్యం నమోదు చేసేందుకు ప్రయత్నించా. టీ విరామం కంటే ముందు మరో వికెట్‌ కోల్పోకూడదనుకున్నాం. ఇతర విషయాల గురించి ఆలోచించకుండా బంతిపై దృష్టి పెట్టమని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పాడు. మొదట్లో ఒత్తిడిగా అనిపించినా ప్రక్రియపైనే ధ్యాస పెట్టా. ప్రత్యర్థి ఏం ఆలోచిస్తుందోనని కాకుండా ఓ ఆటగాడిగా నేనేం చేయగలనో అది చేశా"

-- రిషభ్​ పంత్​

తన డిఫెన్స్‌ను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని అతనన్నాడు. "నేను ఎవరి బౌలింగ్‌లోనైనా ఎదురు దాడి చేయగలనని, కానీ డిఫెన్స్‌ మీద ధ్యాస పెట్టాలని గతంలో నా కోచ్‌ తారక్‌ సిన్హా చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో ప్రతి బంతిపై దృష్టి పెట్టి అందుకు అనుగుణంగా ఆడా. మంచి బంతిని గౌరవించడం శుభ సూచిక. నా ఆటపై దృష్టి సారించినంతగా డిఫెన్స్‌ను పట్టించుకోను. కొన్ని సార్లు విభిన్న షాట్లు ఆడొచ్ఛు కానీ ఏదేమైనా వంద శాతం ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటా. బంతిని బాదాలనుకుంటే బాదేస్తా. కొంతకాలంగా అదే చేస్తున్నా. అది నాకెంతో ఉపయోగపడుతోంది" అని అతను పేర్కొన్నాడు.

ఇవీ చదవండి: ముగిసిన రెండో రోజు ఆట.. బ్యాటు,బంతితో చెలరేగిన బుమ్రా..

అప్పుడు యువీ.. ఇప్పుడు బుమ్రా వరల్డ్​ రికార్డ్​.. పాపం మళ్లీ బ్రాడ్​.. ఒకే ఓవర్లో 35 రన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.