ETV Bharat / sports

కేఎల్ రాహుల్​ టీ20 భవిష్యత్తు ఏంటో? - రెస్ట్​ ఇచ్చారా? పక్కన పెట్టేశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 11:07 AM IST

KL Rahul T20 : 2022 టీ20 వరల్డ్​ కప్​ సెమీస్‌లో ఆడిన టీమ్​ ఇండియాలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత 14 నెలలుగా ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌ ఆడలేదు. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్​కు మాత్రం రోహిత్‌, కోహ్లీకి ఛాన్స్​ వచ్చింది. కానీ రాహుల్‌కు మాత్రం చోటు దక్కలేదు. మరి అతనికి రెస్ట్ ఇచ్చారా? లేదా టీ20లకు పూర్తిగా దూరంగా పెట్టారా? అనే విషయంపై క్లారిటీ లేదు. దాని గురించే ఈ కథనం...

కేఎల్ రాహుల్​కు రెస్ట్​ ఇచ్చారా? పక్కన పెట్టేశారా?
కేఎల్ రాహుల్​కు రెస్ట్​ ఇచ్చారా? పక్కన పెట్టేశారా?

KL Rahul T20 : అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఇటీవలే టీమ్​ ఇండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో రోహిత్‌, కోహ్లీ కూడా ఉండటం విశేషం. వీరిద్దరు జట్టులోకి రావడం వల్ల ఈ ఏడాది జూన్‌ 1న ప్రారంభంకానున్న పొట్టి ప్రపంచకప్‌లోనూ ఆడటం ఖాయం అని తెలుస్తోంది. మరి కేఎల్‌ రాహుల్‌ విషయంలో బీసీసీఐ, జట్టు మేనేజ్‌మెంట్‌ ఏం ఆలోచిస్తోంది అన్నది అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి టీ20 జట్టులో అతడిని పూర్తిగా దూరం పెట్టారా? అనేది హాట్​ టాపిక్​గా మారింది.

ఖాళీ లేదనే చెప్పాలి : ప్రస్తుత టీమ్​ఇండియా టీ20 జట్టులో రాహుల్‌(Teamindia KL rahul) కోసం ఖాళీ లేదనే చెప్పాలి. టీ20ల్లో రాహుల్​ ఎక్కువగా ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. ఇప్పటివరకూ 72 ఇంటర్నేషనల్​ టీ20 మ్యాచుల్లో 37.75 యావరేజ్​తో 2265 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 139.12గా ఉంది. రెండు సెంచరీలు కూడా బాదాడు. అయితే రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్​ను ప్రారంభించేందుకు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ రూపంలో గట్టి పోటీ నెలకొంది. దీంతో రాహుల్‌కు ఓపెనర్‌గా అవకాశం లేనట్టే అనే చెప్పాలి.

రీసెంట్​గా వికెట్‌కీపర్‌గా, మిడిలార్డర్‌ బ్యాటర్‌గా మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని ఉందంటూ తన కోరికను బయట పెట్టాడు రాహుల్‌. ప్రస్తుతం వన్డేల్లో అతడు అదే స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మధ్యే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ సుదీర్ఘ ఫార్మాట్లోనూ మొదటి సారి వికెట్‌ కీపింగ్‌ చేయడమే కాకుండా మిడిలార్డర్‌లో కూడా ఆడాడు. అయితే టీ20ల్లో వికెట్‌కీపర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్ల స్థానాలకు పోటీ నెలకొంది ఉంది. ప్రస్తుతం సంజు శాంసన్‌, జితేశ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్లుగా ఉన్నారు. ఇంకా పంత్‌ కూడా ఐపీఎల్‌తో పునరాగమనం చేసి మంచిగా రాణిస్తే అతడే జట్టుకు మెయిన్​ వికెట్‌కీపర్‌ అవుతాడు. అంటే రాహుల్‌కు చోటే ఉండదని చెప్పాలి. అయినా టీ20ల్లో రాహుల్​ నిలకడగా రాణించట్లేదు. గత టీ20 వరల్డ్​ కప్​లో రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడిన రాహుల్‌ 6 మ్యాచ్‌ల్లో కేవలం 128 రన్స్​ మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 120.75గానే ఉంది. ఇక 2022లో ఆడిన 16 టీ20ల్లోనూ 28.93 యావరేజ్​తో 434 పరుగులే చేశాడు.

ఐపీఎల్‌తో ఛాన్స్​ : టీ20 వరల్డ్​ కప్​లో(T20 World Cup KL Rahul) ఆడే టీమ్​ఇండియా జట్టులోకి వచ్చేలా రాహుల్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​) ఓ అవకాశంగా మారనుంది. గత రెండు సీజన్లలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తరపున ఓపెనర్‌గా ఆడిన అతడు ఈ సీజన్‌లో మిడిలార్డర్‌లో ఆడతాడని సమాచారం అందుతోంది. టీ20 వరల్డ్​ కప్​ జట్టులో చోటే లక్ష్యంగా కేఎల్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో మిడిలార్డర్​లో సమర్థంగా రాణిస్తే, అప్పుడు భారత జట్టు సెలక్షన్​ పరిగణలోకి అతడు వచ్చే ఆస్కారముంది.

పైగా ఈ ఏడాది గాయం నుంచి కోలుకున్న తర్వాత కేఎల్​ మంచి ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్‌లోనూ మంచిగా రాణించాడు. దక్షిణాఫ్రికాలోనూ మంచి ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా సెంచూరియన్‌ టెస్టు కఠిన పరిస్థితుల్లో అతడు బాదిన సెంచరీ అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోనూ అతడు రాణిస్తే.. అతడు తిరిగి టీమ్‌ఇండియా టీ20 జట్టులోకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

అన్నకు తగ్గ తమ్ముడు - అరంగేట్రంలోనే అదరగొట్టిన షమీ బ్రదర్​

ఓపెనింగ్​ రేస్​లో స్టార్ ప్లేయర్లు- వార్నర్ రిప్లేస్​మెంట్ వీళ్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.