ETV Bharat / sports

గాయంపై కీలక అప్డేట్​ ఇచ్చిన కేఎల్ రాహుల్

author img

By

Published : May 10, 2023, 10:57 AM IST

Updated : May 10, 2023, 12:03 PM IST

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కేఎల్ రాహుల్ తన గాయంపై కీలక అప్డేట్​ ఇచ్చాడు. ఆ వివరాలు..

KL Rahul
గాయంపై కీలక అప్డేట్​ ఇచ్చిన కేఎల్ రాహుల్

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కేఎల్ రాహుల్ తన గాయంపై కీలక అప్డేట్​ ఇచ్చాడు. ఆర్సీబీ, లఖ్​నవూ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి తొడ కండరాలకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయంతో ఇబ్బంది పడిన అతడు.. ఆ తర్వాత మిగతా సీజన్​కు దూరమయ్యాడు. రాహుల్‌కు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో అతడు ఈ మెగాటోర్నీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి తప్పుకున్నాడు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రికవరీపై దృష్టి పెడతానని తెలిపాడు. అయితే తాజాగా అతడి కుడి తొడ‌కు విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ ముగిసింది. ఈ విషయాన్ని రాహుల్​.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. చాలా జాగ్రత్తగా, ఎటువంటి ఇబ్బందిలేకుండా స‌ర్జ‌రీ చేసిన డాక్ట‌ర్ల‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

"నా సర్జరీ సక్సెస్​ఫుల్​గా పూర్తైంది. స్మూత్​గా.. నేను ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకున్న వైద్యులు, మెడికల్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. ఇక నేను రికవరీ అయ్యే పనిలో ఉన్నా. త్వరలోనే పూర్తి ఫిట్​నెస్ సాధించి బెస్ట్​గా మైదానంలో దిగాలనే పట్టుదలతో ఉన్నాను" అని రాహుల్ పేర్కొన్నాడు. ఇక ఈ వార్త విన్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ భార్య అతియా శెట్టి, మావయ్య-నటుడు సునీల్ శెట్టి కూడా అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే "నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ శిఖర్ ధావన్​ హగ్ ఎమోజీ ట్వీట్ పెట్టాడు. మిస్టర్​ 360 సూర్య కుమార్​ కూడా ఆకాంక్షించాడు.

కాగా, గాయం కారణంగా రాహుల్​ తొలిసారి ఐపీఎల్‌ను మధ్యలో వీడాడు. ఇంగ్లాండ్​లో మంచి రికార్డు ఉన్న అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కచ్చితంగా బాగా రాణిస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అతడు గాయం కారణంగా ఈ కీలక పోరుకు దూరమయ్యాడు. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఇకపోతే అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక భుజం గాయంతో బాధపడుతున్న ఫాస్ట్‌బౌలర్‌ ఉనద్కత్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆడడంపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని తెలిపింది. అతడు ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడని బీసీసీఐ పేర్కొంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జూన్‌ 7న ఓవల్‌లో ప్రారంభంకానుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు ఇదే: రోహిత్‌ శర్మ, పుజారా, శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లీ, కేఎస్‌ భరత్‌, రహానె, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌, షమి, ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌.

ఇదీ చూడండి: రోహిత్​ చెత్త రికార్డు.. ఇక సూర్యను ఆపడం కష్టమే.. ఆర్సీబీకి అచ్చిరాని మూడో స్థానం!

Last Updated : May 10, 2023, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.