ETV Bharat / sports

ఆసీస్​కు భారీ షాక్​.. మిగతా రెండు మ్యాచ్​లకు వార్నర్​ దూరం..

author img

By

Published : Feb 21, 2023, 12:34 PM IST

Updated : Feb 21, 2023, 1:25 PM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​కు విచ్చేసిన ఆసీస్​కు భారీ షాక్​ తగిలింది. రెండో టెస్ట్​లో తీవ్రంగా గాయపడిన స్టార్ ఓపెనర్ వార్నర్.. మిగిలిన రెండు టెస్ట్​లకూ దూరమయ్యాడు.

David Warner
David Warner

ప్రతిష్ఠాత్మక బోర్డర్​ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్​తో తలపడుతున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్ట్​ మ్యాచ్​ మొదటి ఇన్నింగ్స్​లో గాయం కారణంగా దూరమైన స్టార్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్.. ఇప్పుడు సిరీస్​ మొత్తానికి​ దూరమయ్యాడు. మోచేతికి అయిన ఫ్రాక్చర్​ నుంచి కోలుకోకపోవడమే అందుకు కారణం. వార్నర్​ చికిత్స కోసం ఆస్ట్రేలియా తిరిగొస్తాడని.. మళ్లీ వన్డే సిరీస్​కు అందబాటులో ఉండొచ్చని క్రికెట్​ ఆస్ట్రేలియా తెలిపింది. గాయాల కారణంగా ఇప్పటికే హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ జట్టుకు దూరమవ్వగా.. ఇప్పుడు వార్నర్‌ కూడా ఆ జాబితాలో చేరాడు

ఇదీ జరిగింది..
రెండో టెస్ట్ మ్యాచ్​లోని తొలిరోజు ఆటలో టీమ్​ఇండియా బౌలర్​ సిరాజ్​ వేసిన ఓ బౌన్సర్ అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన వార్నర్.. ఫిజియోలతో ట్రీట్‌మెంట్ తీసుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తర్వాత మరో రెండు, మూడు బౌన్సర్లు అతని హెల్మెట్‌కు బలంగా తాకాయి. ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. గాయాలతో బ్యాటింగ్‌ కొనసాగించిన వార్నర్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అతడు మైదానంలోకి రాలేదు. భారత ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్​ కూడా చేయలేదు.

ఉ‌‌స్మాన్ ఖవాజా సైతం వార్నర్ పరిస్థితి అంత బాగాలేదని చెప్పాడు. 'వార్నర్ గాయంపై మెడికల్ స్టాఫ్ శనివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అతడి తలకు, భుజానికి బలమైన గాయాలయ్యాయి. అస్వస్థతకు లోనయ్యాడు. దాంతోనే మైదానంలోకి రాలేదు. అతడి ఏమైందనేది మెడికల్ టీమ్ పరీక్షిస్తోంది' అని ఖవాజా చెప్పుకొచ్చాడు. ఇక, ఇరు జట్ల మధ్య మూడో వన్డే.. ఇందోర్​ వేదికగా మార్చి 1వ ప్రారంభం కానుంది.

Last Updated : Feb 21, 2023, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.