ETV Bharat / sitara

పునీత్​ రాజ్​కుమార్​కు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' నివాళి

author img

By

Published : Nov 7, 2021, 4:20 PM IST

'శ్రీదేవీ డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో అలరిస్తోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా పునీత్ విషెస్ చెబుతున్న ఓ వీడియో కూడా ఇందులో ఉంది. ఆయనకు ఈ ఎపిసోడ్​ను అంకితమిచ్చారు.

punith rajkumar news
పునీత్ రాజ్ కుమార్

ఇటీవల మరణించిన కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్​కు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' నివాళి అర్పించింది. వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్​ను ఆయనకు అంకితమిచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాథ శరణాలయాలు, 1800 మందికి ఉచితంగా విద్యనందిస్తూ ప్రజల మనసుల్లో పునీత్ నిలిచిపోయారు.

ఈ ప్రోమోలో భాగంగా గెటప్ శీను, రాంప్రసాద్, రాఘవల పిల్లలు వచ్చి 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సందడి చేశారు. వీరితో పాటు చిన్నారి సింగర్స్, యాక్టర్స్ కూడా విచ్చేసి తమదైన ఎంటర్​టైన్​మెంట్ అందించారు. 'పిల్లల సందడి' పేరుతో రాబోయే ఈ ఎపిసోడ్.. నవంబరు 14న పిల్లల దినోత్సవం సందర్భంగా ఈటీవీలో మధ్యాహ్నం ప్రసారమవుతుంది. ఈ షోకు ఇంద్రజతో పాటు అలనాటి యాంకర్ ఉదయభాను కూడా విచ్చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.