ETV Bharat / priya

ఓట్స్​తో కట్​లెట్​.. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి

author img

By

Published : Jul 22, 2021, 6:31 AM IST

Updated : Jul 22, 2021, 7:18 AM IST

బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం అదుపులో ఉంచుకోవాలి అనుకునే వారికి ఓట్స్​ మంచివి. ఇలాంటివారు అన్నానికి బదులు ఓట్స్​ తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇంతటి ఆరోగ్యకరమైన ఓట్స్​తో పొద్దుపొద్దునే వేడివేడిగా బ్రేక్​ఫాస్ట్​ చేస్తే.. రోజంతా చలాకీగా ఉండొచ్చు. అయితే అలాంటి ఆరోగ్యకరమైన బ్రేక్​ఫాస్ట్​ 'ఓట్స్​ కట్​లెట్'​ ఎలా తయారు చేసుకోవాలో.. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

oats cutlet
ఓట్స్​ కట్​లెట్​

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో స్వయంపాకం రుచి చూడడానికి సమయం దొరకడం లేదు. అందుకే చాలా మంది రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీ లాంటి ఇన్​స్టంట్​ ఫుడ్​కు అలవాటు పడ్డారు. ఇదే కోవకు చెందే వాటిలో మరొకటి ఓట్స్​. దీనితో తయారు చేసే కట్​లెట్​ను నోట్లో వేసుకుంటే.. ఎవరైనా వవ్హా.. అనాల్సిందే. ఇలాంటి ఓట్స్​ కట్​లెట్​ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?

కావాల్సిన పదార్థాలు..

  • కప్పు ఓట్స్​
  • అర కప్పు పనీర్​
  • నాలుగు టీ స్పూన్ల క్యారెట్​ తురుము
  • కప్పు బంగాళాదుంప
  • టీ స్పూన్​ అల్లం​ పేస్ట్​
  • రెండు టేబుల్​స్పూన్ల వంట నూనె​
  • తగినంత ఉప్పు
  • సగం టీ స్పూన్​ గరం మసాలా పొడి ​
  • టీ స్పూన్​ కారం
  • టీ స్పూన్​ పచ్చిమిర్చి

తయారు చేసుకునే విధానం..

  1. ముందుగా బంగాళదుంపల్ని తీసుకోవాలి. వాటిని మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టాలి. అనంతరం వేడి నీటి నుంచి బయటకు తీసి వాటిపైన ఉన్న తొడుగును తీసేయాలి. ఆపై వాటిని గుజ్జుగుజ్జుగా అయ్యే వరకు కలపాలి. దానితో పాటే క్యారెట్ తురుమును కూడా తీసుకోవాలి.
  2. ఓ గిన్నె తీసుకోవాలి. దానిలో ఓట్స్​తో పాటు పచ్చిమిర్చి పేస్ట్​, అల్లం పేస్ట్​, క్యారెట్​ తరుము, బంగాళదుంప పేస్ట్, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేయాలి. ముద్దగా ఉన్న పనీర్​ను చిన్నగా నలిపి గిన్నెలో కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చేతితో బాగా కలపాలి. అప్పుడు మెత్తటి పిండిలాగా తయారు అవుతుంది.
  3. పిండిగా తయారైన దానిని చిన్న చిన్న ఉండలుగా విడదీసుకోవాలి. వాటిని రెండు చేతులతో చిన్నగా అదిమి కట్​లెట్​ ఆకారంలో ఫ్లాట్​గా చేసుకోవాలి.
  4. గ్యాస్​ మీద పెనం​ (ప్యాన్) పెట్టుకోవాలి. తక్కువ మంటతో వేడి చేయాలి. రెండు టీ స్పూన్​ల నూనెను వేయాలి. కొంచెంసేపటి తరువాత కట్​లెట్​ను నూనెలో వేయాలి. దోరగా గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. అంతే వేడివేడి కట్​లెట్​ రెడీ.

ఇలా రెడీ అయిన ఓట్స్​ కట్​లెట్​ను గ్రీన్​ చట్నీ, టొమాటో కచప్​తో తింటే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వర్షాకాలంలో వేడివేడి ఓట్స్ కట్​లెట్​ను తయారుచేసుకుని ఆస్వాదించండి .

ఇదీ చూడండి: ఈ దోసెలు ఎప్పుడైనా టేస్ట్​ చేశారా?

Last Updated : Jul 22, 2021, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.