అంగన్వాడీల రాస్తారోకోలు - పోలీసుల అరెస్ట్​లు

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 20, 2024, 5:47 PM IST

anganwadi_worker

State wide Anganwadi workers Strike : డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 40వ రోజుకు చేరాయి. అంగన్వాడీలకు మద్దతుగా ఆందోళనలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 40వ రోజులుగా సమ్మె చేస్తున్నా. సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

అంగన్వాడీ రాస్తారోకోలు - పోలీసుల అరెస్ట్​లు

State wide Anganwadi workers Strike : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 40వ రోజుకు చేరింది. పాదయాత్ర సమయంలో వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఇచ్చిన హామీలు నమ్మి, ఎన్నికల్లో గెలిపించి తప్పు చేశామని అంగన్​వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయపరమైన డిమాండ్లలను కోరుతున్నామే తప్పా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : అంగన్వాడీలు

Anganwadi Workers Strike in Vijayawada : సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. విజయవాడలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. లెనిన్ సెంటర్‌లో రాస్తారోకోకు కార్మిక సంఘాల నేతలు సిద్ధమయ్యారు. అనుమతి లేదంటూ నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు.

ప్రభుత్వ తాటకు చప్పుళ్లకు వెనక్కి తగ్గేదే లేదు : అంగన్వాడీలు

NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీ శిబిరాన్ని ప్రవాసాంధ్రులు సందర్శించి ఆందోళనకు మద్దతు తెలిపారు.

Bapatla District : బాపట్ల జిల్లా చీరాలలో అంగన్వాడీలకు మద్దతుగా సీఐటీయూ నేతలు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టిన అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణమని నేతలు మండిపడ్డారు. కనీస వేతనం అమలు, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

'పండుగ వేళ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది' - 36 రోజులుగా అంగన్వాడీల సమ్మె

Konaseema District : తక్షణమే డిమాండ్లను పరిష్కరించాలని కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు డిమాండ్ చేశారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అంగన్వాడీలకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ అంగన్వాడీల సమస్యల పరిష్కరించకపోతే గద్దె దింపుతామని హెచ్చరించారు. శ్రీకాకుళంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పండగకు దూరమైన అక్కచెల్లెమ్మలు - కొనసాగుతున్న అంగన్​వాడీల ఆందోళన

Nellore District : నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కలెక్టరేట్​ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అంగన్వాడీలకు మద్ధతు ఇస్తున్న సీపీఎం నాయకులను అరెస్ట్​ చేశారు. దీంతో అరెస్ట్​ చేసిన నాయకులను విడిచిపెట్టే వరకు పోలీస్​ వాహనాలకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై ట్రాపిక్​ స్థంబించింది. ఈ సందర్భంగా పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీస్​ వాహనాల్లో ఎక్కించిన నేతలను విడిచి పెట్టడంతో పరిస్థితి సర్దుమనిగింది.

Guntur District : సీఎం జగన్​ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడీలు రాస్తారోకో చేపట్టారు. తాము సమ్మెకు దిగటం వల్ల లబ్దిదారులకు పౌష్టికాహారం అందించలేకపోతున్నామని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్​ జిల్లా తిరువూరు పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. భగ భగ మండే సూర్యుని చూడు అంగన్​వాడీల సత్తా చూడు అంటూ నినాదాలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.