LIVE: హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా షో - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 10:22 AM IST

Updated : Jan 18, 2024, 11:18 AM IST

thumbnail

Wings India Show 2024 Live : హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా ప్రదర్శనకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 130 ఎగ్జిబిట్‌లను ఉంచారు. దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించారు. 106 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. దాదాపు 5000ల మంది వ్యాపారవేత్తలు వింగ్స్ ఇండియాను సందర్శించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయంలోనే గతంలో రెండుసార్లు ఈ ప్రదర్శనను నిర్వహించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనని నిర్వాహకులు తెలిపారు. దేశంలో ఉన్న సాధారణ ప్రజలకు విమాన ప్రయాణాన్ని కల్పించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ తరహా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేసిన హెలికాప్టర్లను వింగ్స్ ఇండియాలో ప్రదర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777X విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ప్రదర్శనగా ఉంచారు. అనంతరం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ350 విమానాన్ని ఆవిష్కరించనున్నారు. 

Last Updated : Jan 18, 2024, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.