LIVE : టీడీపీలోకి విజయసాయి రెడ్డి బంధువులు - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 4:06 PM IST

Updated : Jan 3, 2024, 5:16 PM IST

thumbnail

LIVE: రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్​సీపీ పోకడ, చర్యలు నచ్చక చాలా మంది నేతలు తెలుగుదేశంలో భారీగా చేరుతున్నారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి బంధువులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. వారంతా టీడీపీలో చేరేందుకు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. అందులో విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకానాథ రెడ్డితో పాటు అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం  వైఎస్సార్​సీపీ కార్యకర్తలున్నారు. వీరంతా చంద్రాబాబు హయంలోనే తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు.

 విజయసాయి, ఆయన భార్య మినహా బందువులంతా టీడీపీలో చేరేందుకు తరలివచ్చినట్లు విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకానాథ రెడ్డి వివరించారు. రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి దంపతులు కూడా వైఎస్సార్​సీపీని వీడే పరిస్థితి రావొచ్చేమోనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డిని తెలుగుదేశంలోకి రమ్మని ఆహ్వానించే హక్కు కూడా తనకుందని ఆయన అన్నారు. వైఎస్సార్​సీపీలో తనకు పలుమార్లు టిక్కెట్ ఇస్తానని మాట తప్పారని ఆయన ఆరోపించారు. రాయచోటి టిక్కెట్ ఇవ్వకపోయినా, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి కూడా మోసగించారన్నారు. 

Last Updated : Jan 3, 2024, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.