ETV Bharat / lifestyle

India skills-2021: అందం, అలంకరణ, ఆతిథ్య రంగాల వైపునకు యువత అడుగులు

author img

By

Published : Dec 9, 2021, 1:14 PM IST

Youth competition
Youth competition

India skills-2021: మారుతున్న ప్రపంచ రీతుల్లో.. యువత అందం, అలంకరణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. చిన్నచిన్న పార్టీల నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాల వరకు ప్రత్యేకంగా సిద్ధమైపోతున్నారు. ఏటా ఈ రంగంలో వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలానే.. పర్యాటక రంగమూ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వెనుకబడినా.. రానున్న రోజుల్లో కోట్ల మందికి ఉపాధి అవకాశాలు చూపించనుంది. అందుకే.. ఈ రెండు రంగాల్లో తమ నైపుణ్యాల్ని ప్రదర్శించేందుకు.. విద్యార్థులు పోటీపడ్డారు.

అందం, అలంకరణ, ఆతిథ్య రంగాల్లో పోటీపడుతున్న యువత

India skills-2021: ప్రపంచం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందం చుట్టూ తిరుగుతుంది. సాధారణ యువతీ యువకుల నుంచి ప్రముఖుల వరకు నిత్యం అందానికి మెరుగులు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. అందుకే.. బ్యూటీరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా సంస్థలూ పోటీ పడుతు న్నాయి. అందుకే స్కిల్స్ ఇండియా పోటీల్లో భాగంగా.. పోటీల్లో నేరుగా ప్రొఫెషనల్ పార్లర్‌లో టాప్ మోడళ్లను అలంకరించే అవకాశం కల్పించారు.

పోటీ సమయంలో వారి పనితనం, వేగం, సృజనాత్మకత వంటి విషయాల్ని పరిగణలోకి తీసుకుని.. విజేతల్ని నిర్ణయించారు. ఇలాంటి పోటీల వల్ల రానున్న రోజుల్లో ఎవరికి వారే.. ఫస్ట్‌క్లాస్ బ్యూటీ పార్లర్ పెట్టుకునే సమర్థత వస్తుందంటున్నారు నిపుణులు. స్వయం ఉపాధి పొందడమే కాక.. మరో పది మందికి ఉపాధి కల్పించేలా తయారవుతారని చెబుతున్నారు.

ఆతిథ్యరంగం వైపు యువత ఆసక్తి..
ఏటికేటా కోట్లమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.. ఆతిథ్యరంగం. పర్యాటకం, ఆదరణ, ఆహార, రవాణా వంటి అంశాలన్నీ ఇమిడి ఉన్న ఆతిథ్యరంగంలో నైపుణ్యాలు సాధించేందుకు యువతీ యువకులు ఆసక్తి చూపించారు. పాఠ్యపుస్తకాల్లో అభ్యసించిన విషయాల్ని అనుభవ పూర్వకంగా తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పర్యాటకులను ఆహ్వానించడం, కావాల్సిన రీతిలో బస, విందు, విహార ప్రదేశాలకు వెళ్లేందుకు రవాణా సిద్ధం చేయడం వంటికి ఉంటాయి. వీటితో పాటు పర్యాటకుల అనుమానాల్ని నివృత్తి చేయడం సహా వివిధ అంశాలపై నైపుణ్యాల్ని ప్రదర్శించారు యువత. స్కిల్‌ ఇండియా పోటీల్లో ఈ విభాగం ప్రత్యేకంగా నిలిచింది.
3వ స్థానంలో ఆతిథ్య రంగం
అంతర్జాతీయంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాల్లో ఆతిథ్య రంగం 3వ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు.. యువత చేస్తున్న శ్రమ ఫలితాల్ని ఇస్తుందని, అత్యధిక పారితోషికం అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయ పడుతున్నారు.

ఇదీ చదవండి: Pratidwani: తెలుగు రాష్ట్రాల్లో.. వ్యవసాయం ఎందుకు భారంగా మారింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.