ETV Bharat / jagte-raho

తెలంగాణ: ఫంక్షన్​కు తీసుకెళ్లలేదని యువతి‌‌ ఆత్మహత్య

author img

By

Published : Dec 17, 2020, 7:38 PM IST

ఫంక్షన్​కు తీసుకెళ్లలేదని తండ్రితో గొడవపడిన యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళ్ల ముందే తిరిగిన బిడ్డ కానరాని లోకాలకు పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

woman suicide after fight with her father
ఫంక్షన్​కు తీసుకెళ్లలేదని యువతి‌‌ ఆత్మహత్య

శుభకార్యానికి తీసుకెళ్లలేదని తండ్రితో గొడవపడిన యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ మేడ్చల్ కే.యల్.ఆర్ విజయ్ కాలనీలో చోటుచేసుకుంది. రవళి రెడ్డి(24) తమ‌ సమీప బంధువుల ఇంట్లో ఎంగేజ్మెంట్​కు పోదామని తండ్రితో చెప్పగా.. బస్సు డ్రైవర్​గా ఉద్యోగం చేస్తున్న తనకు సెలవు దొరకడం కష్టమని అన్నారు. ఫంక్షన్​కు వెళ్లడానికి సమయం కుదరదని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కళ్ల ముందే తిరిన బిడ్డ కానరాని లోకాలకు పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: పీఎస్‌ఎల్‌వీ-సి50 ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.