ETV Bharat / jagte-raho

కృష్ణలంక రణదివేనగర్​లో మహిళ హత్య కలకలం

author img

By

Published : Oct 26, 2020, 6:23 PM IST

విజయవాడ కృష్ణలంక రణదివేనగర్​లో మహిళ హత్య కలకలం రేపింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆమెతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య జరిగిన ఆ పెనుగులాటలో భార్య మృతి చెందింది.

a woman murder at krishna lanka in krishna district
కృష్ణలంక రణదివేనగర్​లో మహిళ హత్య కలకలం

కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణలంక రణదివేనగర్​లో మహిళ హత్య కలకలం రేపింది. ఆటోడ్రైవర్​గా పనిచేస్తున్న కృపానందం భార్య నాగమణిపై దాడి చేశాడు. ఈ ఘర్షణలో నాగమణి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తరచు అనుమానించేవాడు..

నాగమణిపై కృపానందంకు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడని స్థానికలు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవ పడేవారు. కొన్ని రోజుల కిందట నాగమణి పుట్టింటికి వెళ్లి.. ఈ రోజు తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

దారుణం: కుమారుడిని హత్యచేసిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.