రిషి సునాక్ షాకింగ్ నిర్ణయం- ఆ వీసాలు ఇక కష్టమే! భారతీయులపై ఎఫెక్ట్

author img

By ETV Bharat Telugu Desk

Published : Dec 5, 2023, 9:15 AM IST

Updated : Dec 5, 2023, 9:29 AM IST

uk visa rule changes 2023

UK Visa Rule Changes 2023 : ఉపాధి వీసాల జారీని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది రిషి సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ సర్కారు. అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిశ్చయించింది.

UK Visa Rule Changes 2023 : దేశంలో విపరీతంగా పెరుగుతున్న వలసలను అడ్డుకునేందుకు ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్‌లోని రిషి సునాక్ సర్కారు నిర్ణయించింది. ఇక నుంచి అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్రిటన్‌ హోంశాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ సోమవారం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పని చేయడానికి వెళ్లిన వృత్తి నిపుణులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌ తీసుకురాలేరు. కఠిన నిబంధనల వల్ల ప్రస్తుత వలసల్లో 3లక్షల మంది వరకు తగ్గుతారని మంత్రి క్లెవర్లీ చెప్పారు.

బ్రిటన్‌లో వృత్తి నిపుణుల వీసా పొందడానికి గతంలో ఏడాదికి 26,200 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఆ వేతనం 38,700 పౌండ్లు ఉండాలని నిర్ణయించింది. గతంలో కుటుంబ వీసా కోసం 18,600 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. దానినీ 38,700 పౌండ్లకు ప్రభుత్వం పెంచింది. భవిష్యత్తులో విద్యార్థి వీసాలపైనా ఆంక్షలను అమలు చేయనున్నట్లు మంత్రి క్లెవర్లీ ప్రకటించారు. రికార్డ్ స్థాయిలో వలసలు వచ్చినట్లు బ్రిటన్​ జాతీయ గణాంక కార్యాలయం నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సుమారు 6,72,000 మంది బ్రిటన్​కు రాగా, వీరిలో అత్యధికులు భారతీయులే ఉన్నట్లు చెప్పింది.

విద్యార్థి వీసాలు కఠినతరం
అంతకుముందు విదేశీ విద్యార్థులకు వీసాలను మరింత కఠినతరం చేసింది బ్రిటన్​. విదేశీ విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి స్వస్తి పలికింది. కొత్త నిబంధనల ప్రకారం పరిశోధనేతర పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులు తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదు. ఇక నుంచి కేవలం పరిశోధన విభాగానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులను అభ్యసిస్తున్న విదార్థులు మాత్రమే తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక, విదేశీ విద్యార్థి చదువు పూర్తికాకముందు ఉద్యోగం చేయడానికి కూడా ఇక నుంచి వీలుండదు.

భారతీయ యువతకు గుడ్​న్యూస్​.. 2,400 యూకే వీసాలు జారీ

H1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై అమెరికాలోనే వీసా రెన్యువల్‌!

Last Updated :Dec 5, 2023, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.