ETV Bharat / international

బ్రిటన్​ ప్రధాని రేసులో రిషి సునాక్​..  తొలి రౌండ్​లో ముందంజ

author img

By

Published : Jul 13, 2022, 11:01 PM IST

Rishi Sunak: బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునాక్​ ముందంజలో ఉన్నారు. బుధవారం జరిగిన కన్జర్వేటివ్​ పార్టీ తొలి రౌండ్​ ఎన్నికలో అత్యధిక శాతం ఓట్లు గెలుచుకున్నారు. గురువారం జరగబోయే రెండో రౌండ్ ఎన్నికకు అర్హత సాధించారు. ప్రధాని పదవికి సెప్టెంబరు 5న తుది ఎన్నిక జరగనుంది.

Rishi Sunak
Rishi Sunak

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్న ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్​ పార్టీ అధినేత పదవి కోసం బుధవారం జరిగిన తొలి రౌండ్​ ఓటింగ్​లో ఆయన అత్యధిక ఓట్లు గెలుచుకున్నారు. దాంతో పాటు గురువారం జరగనున్న రెండో రౌండ్​కు అర్హత సాధించారు.
తొలి రౌండ్​లో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో కనీస మద్దతు సాధించని ఇద్దరు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. మిగతా ఆరుగురు అభ్యర్థులు రెండో రౌండ్​లో పాల్గొనున్నారు. ఈ నెల 21 నాటికల్లా పోటీలో ఇద్దరు అభ్యర్థులే మిగిలేలా తదుపరి రౌండ్లు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 5న తుది ఎన్నిక.. బ్రిటన్‌ నూతన ప్రధానిని కన్జర్వేటివ్‌ పార్టీ ఈ ఏడాది సెప్టెంబరు 5న ఎన్నుకోనుంది. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతగా ఎన్నికైనవారే బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు. కన్జర్వేటివ్‌ హోం వెబ్‌సైట్‌ తమ పార్టీలో నిర్వహించిన ఓ సర్వే- సునాక్‌ మూడో స్థానానికి పరిమితమవుతారని అంచనా వేసింది. పెన్నీ మోర్డాంట్‌ ప్రధాని పీఠం దక్కించుకుంటారని జోస్యం చెప్పింది. బదెనోచ్‌, సునాక్‌, బ్రావెర్మన్‌ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలుస్తారని తెలిపింది.

ఇవీ చదవండి:

లంకలో నిరసనకారుల దండయాత్ర.. సింగపూర్​కు రాజపక్స!

లంకలో ఆగ్రహజ్వాల.. ప్రధాని ఆఫీస్​లోకి ఆందోళనకారులు.. రాజీనామాకు డిమాండ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.