ETV Bharat / headlines

ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : May 18, 2021, 5:01 PM IST

.

top news
top news

  • తిరుపతి రుయా ఘటన: 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

తిరుపతి రుయా ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఆక్సిజన్ కొరతతో 11 మంది చనిపోయారని వచ్చిన ఫిర్యాదులతో.. నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు

రాష్ట్రాన్ని బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ఏపీలో చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్'

ఏపీలో బ్లాక్ ఫంగస్​తో ఐదుగురు మృతి చెందటం బాధాకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి చికిత్సకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రూ.50 లక్షల విలువైన మద్యం స్వాధీనం

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం, గాజులపల్లిలో రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మహిళపై విరిగిపడ్డ చెట్టు- చివరకు...

ముంబయిలో తౌక్టే తుపాను వల్ల చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. వేగంగా వీస్తున్న గాలుల ధాటికి ఓ చెట్టుకూలుతుండగా దానికింద నుంచి వెళుతున్న ఓ మహిళ గమనించి పక్కకు తప్పుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎన్నికల విధులకు హాజరైన 52 మంది టీచర్లు మృతి

కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీదర్ నుంచి విధులకు హాజరైన 52 మంది టీచర్లు కరోనాతో మృతి చెందడం కలకలం సృష్టించింది. మరో 26 మంది కరోనాతో పోరాడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి ధర

దేశీయంగా బంగారం, వెండి ధరలు మంగళవారం పుంజుకున్నాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.300కి పైగా పెరిగింది. వెండి ధర కిలో రూ.73 వేల పైకి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బీసీసీఐకి వేదా కృష్ణమూర్తి ఎమోషనల్ మెసేజ్

బీసీసీఐ కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు తెలిపింది భారత మహిళా క్రికెటర్​ వేదా కృష్ణమూర్తి. కొవిడ్ కారణంగా తన తల్లి, అక్కను కోల్పోయిన సమయంలో తనకు మద్దతుగా నిలిచారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బాల్ ట్యాంపరింగ్ రగడపై బాన్​క్రాఫ్ట్ వెనకడుగు!

బాల్​ టాంపరింగ్ విషయంలో వెనక్కి తగ్గాడు ఆసీస్ క్రికెటర్ కామెరూన్​ బాన్​క్రాఫ్ట్. సాండ్ పేపర్ గేట్ వివాదంలో కొత్తగా చెప్పాల్సిన సమాచారమేమీ లేదని స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'నా వ్యాఖ్యలతో 'కరోనా ఫ్యాన్స్​' బాధపడొచ్చు!'

'క్వీన్​' కంగనా రనౌత్​ కరోనా వైరస్​ నుంచి పూర్తిగా కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే వైరస్​ను జయించిన తన అనుభవాలను పంచుకోవాలని అనుకున్నా.. తన వ్యాఖ్యలతో కరోనా​ ఫ్యాన్స్​ క్లబ్​ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.